మహేష్ బ్రాండ్ దోసె @ 678

11 Apr 2016


లోకో భిన్న రుచి అంటారు.. సినిమా తారల  పేర్లు పిల్లలికి పెట్టి ఆనందించే వాళ్ళు కొంతమంది అయితే, వాళ్ళ హెయిర్ స్టైల్స్ ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు  హైదరాబాద్ ఫిల్మ్నగర్ లో మహేష్ బ్రాండ్ దోసె ఒకటి చక్కర్లు కొడుతోంది. ఫిల్మ నగర్ రోడ్ నెంబర్ వన్ లో  ఫిలిం నగర్ క్లబ్ ఎదురు కారమ్ పొడి అని ఓ హోటల్ ఉంది. ఇది ఇండస్ట్రీ వాసులని అక్కడ చక్కర్లు కొట్టే ఆర్టిస్ట్స్ కి సుపరిచితం ఆ హోటల్ లో ఇప్పుడు ఓ దోసె కి శ్రీమంతుడు దోసె అని పేరు పెట్టుకున్నారు.

దాని రేట్ 678 రూపాయలు. మంచి ఘాటైన సౌత్ ఇండియన్ డిషెస్ కి ఇది పాపులర్. బజ్జిలు దోసెల స్పెసిలిస్ట్ గ కూడా చెప్తారు ఇందులో మహేష్ బ్రాండ్ అట్టు రేట్ ఇంత పెట్టడం వెనుక కారణం ఏంటంటే దిని తయారీ లో బంగారం పూత కూడా వాడతారట. హైదరాబాద్ లో ఇలాంటి వెరైటి లేదు గతం లోబెంగళూరు  లో రాజ్భోగ్ అని ఓ రెస్టారెంట్ లో బంగారపు దోసె వండుతారు, కానీ దాని రేట్ వెయ్యి పదకొండు రూపాయలు. అయితే దానికి ఇలా ఓ ఫిలిం స్టార్ పేరు మాత్రం వాడటం లేదు. మరి బంగారపు అట్టు ట్రై చేసేవాళ్ళు ఓ లుక్కెయ్యండి.
Hero Mahesh Babu is very popular. Now Mahesh Dosa is very popular in Hyderabad, Film Nagar. This Mahesh dosa cost is 678 rupees, it is made with gold coating.