లోఫర్ గాళ్లెవరు?

18 Apr 2016


సినిమా ఇండస్ట్రీలో బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువగాళ్లే ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు సినిమా ఎక్కువ రేట్లకు కొని, తర్వాత ఏడ్చినంత మాత్రాన లాస్ ఎవడూ పూడ్చడు. ఐతే లింగా సినిమాకి జరిగిందే ఇప్పుడు తెలుగులో లోఫర్ కి జరుగుతోంది. ఏదో భారీగా లాస్ వచ్చిందని, అది పూరీజగన్నాధ్, నిర్మాతలు భరించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు హడావుడి చేస్తున్నారు. పైగా సూసైడ్లు కూడా చేసుకుంటామని బెదిరిస్తున్నారు. నిజానికి లోఫర్ పై ఎవడికీ అంచనాలు లేవ్, అలాంటి సినిమాని అంత రేటు పెట్టి ఎవడు కొనమన్నాడు..? ఓవేళ హిట్టై లాభాలు వస్తే ఆ లాభాలు నిర్మాతకి, పూరీకి పంచేవాళ్లా లేదు. మరి పూరీ జగన్నాధ్ ఏమైనా భీకరమైన హిట్లు ఇస్తున్నాడా అంటే వరస ఫ్లాపులే, అలాంటప్పుడు అతగాడు ఎలా రెవెన్యూ తెచ్చిపెట్టగలడని ఈ డిస్ట్రిబ్యూటర్లంతా అతగాడికి అంత రెమ్యునరేషన్ ఇప్పించగలిగారు. 

అదీ రైటనుకుందాం, ఇప్పుడు మేం అతనిపై దాడి చేయలేదు. అతనే డబ్బు వెనక్కి కాస్తైనా ఇవ్వాలని దేబిరించడం ఏంటి, డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం ఎవడి ప్రొడక్ట్ ని వాడు అమ్ముకుంటాడు. అది తెలిసి కూడా భారీగా కొన్నాం భారీగా కొన్నాం అని ఫీలర్లు ఇవ్వడమేంటి. రేపు బాలకృష్ణ వందో సినిమా, చిరంజీవి 150వ సినిమా, సర్దార్ గబ్బర్ సింగ్, బ్రూస్ లీ, ఆగడు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇలానే ముందుకు వస్తే ఎవరు సమాదానం చెప్పాలి, చూడబోతోంటే ఇదేదో పబ్లిసిటీ జిమ్మిక్కు యవ్వారంలా అన్పించకమానదు. అటు ఇటు తిరిగి నా సినిమా ఇంత ఫ్లాపా అని వరుణ్ తేజ్ లోలోపల ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాలపై కేసులు పెట్టినంతమాత్రాన ఒరిగేదేం ఉండదు, అనుకున్న రెమ్యునరేషన్ ఇచ్చేసిన తర్వాత హిట్, ఫ్లాప్ కి ఎవడు గ్యారంటీ ఇవ్వగలడు. అలా ఇచ్చానని ఒప్పందం ఉంటే కోర్టేమైనా చేయగలదేమో మరి!
Business in movie industry has no guaranty. Present Lofer movie distributors are doing non sense at puri jagandh. He has to return money.