నా రెండోది చూస్తే అంతే

4 Apr 2016


లావణ్య త్రిపాఠి సన్నజాజి తీగలాంటి అందాలతో తెలుగోళ్ల మనసులను దోచేసుకుంది. ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా మూవీతో అటు ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు, యూత్ మనసును కొల్లగొట్టిన సుందరి. చీరకట్టుతో కూడా  ఎంత సెక్సీగా కన్పించొచ్చో మరోసారి ప్రూవ్ చేసిందా సినిమాతో. ఐతే వరసగా అలాంటి సినిమాలే వస్తుండటంతో లావణ్యకి బోర్ కొట్టేసిందట. తన వయస్సు వాళ్లతోపాటు, ఏజ్ బారైన హీరోయిన్లు కూడా మాంఛీ యూత్ ఫుల్ డ్రెస్సులతో ఆడిపాడుతుంటే తాను మాత్రం ఇలా హోమ్లీ ఇమేజ్ తోనే కంటిన్యూ కావడం తన కెరీర్ కి దెబ్బ అని వెంటనే గ్రహించేసినట్లుందీ అమ్మడు.

అందుకే నా రెండోవైపు చూడండి, నా రెండో లుక్ చూస్తే ఇక అంతే సంగతులు, నన్నొదిలి పెట్టరంటూ ఫోజులు కొడుతోంది. అందాల రాక్షసి, మిధున కాదు, సోగ్గాడే చిన్నినాయన,  సీత కాదు ఇంకా చేయాల్సిన క్యారెక్టర్లు చాలా ఉన్నాయంటూ ఊరిస్తోంది. ఓ యూత్ క్యారెక్టర్లో కేక పుట్టించానంటే ఇక జనం వేరే హీరోయిన్ మొహమే చూడరంటూ చెప్పుకుంటోంది. అందుకే మెగా కాంపౌండ్ లోని ఇద్దరు హీరోల సినిమాలు విడుదలైతే, తన స్టార్ తిరిగిపోతుందని అంచనాల్లో ఉంది లావణ్య.
Lavanya Tripati latest movie Sogaade Chinninayana got big success. In this movie she appeared in saree. Now she want to appear very hot in her next movie.