రుద్రాక్ష పోయి..నక్షత్రం వచ్చిందేం

28 Apr 2016


డైరక్టర్ కృష్ణవంశీ సినిమాలంటే యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా ఓ మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎన్ని ఫ్లాప్ లు తీసినా, అవి టీవీల్లో వస్తున్నప్పుడు మాత్రం ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చే స్తారు. ఐతే ఆ స్థాయి సినిమాలు మాత్రం ఈ మధ్య తీయలేకపోతున్నాడని టాక్. హిట్ల పరంగా అది నిజమైంది కూడా, చందమామ తర్వాత మనోడికి పెద్ద సక్సెస్ ఏదీ లేదు. ఇప్పుడు నక్షత్రం పేరుతో ఓ కొత్త సినిమా ఓపెనవడమే సర్ ప్రైజింగా ఉంది. ఎందుకంటే రుద్రాక్ష పేరుతో ఓ భారీ సినిమా తీస్తున్నా, అందులో అనుష్క చేయాలి, ఆమే చేయాలి లేకపోతే చేయను అంటూ హడావుడి చేశాడు. తర్వాత సమంతని తీసుకున్నారని టాక్ కూడా ఉంది.

ఐతే ఇప్పుడు హఠాత్తుగా అదంతా చాపచుట్టేసినట్లు, నక్షత్రం ఓపెనవడం మరి విచిత్రమే. కాదు కాదు అది ఆపలేదనడానికి కృష్ణవంశీ ఎప్పుడూ రెండు సినిమాలు ఒకేసారి చేసింది లేదు. సినిమా కథ చూస్తేనేమో పోలీస్ అవ్వాలనే యూత్ కథ అట, సందీప్ కిషన్ నిజంగా కృష్ణవంశీ స్కూల్ కి ఎగ్జాట్ గా అమరిపోతాడు. ఐతే జస్ట్ ముహూర్తం షాట్ తోనే కాకుండా, రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఖచ్చితంగా రుద్రాక్షని పక్కనబెట్టడం వల్లనే సాధ్యమవుతుంది లేదంటే స్క్రిప్ట్ లేకుండా సినిమా షూటింగ్ జరపడం సాధ్యం కాదు కదా..!
Tollywood family director Krishna Vamsi has no hits from last few years. After Chandamama he has no big hit. Now he is doing Nakshatram movie.