కోమటిరెడ్డి భజన

4 Apr 2016


కాంగ్రెస్ లో దివంగత వైఎస్ సిఎంగా ఉన్నన్నాళ్లూ ప్రాజెక్టుల కాంట్రాక్టుల రూపంలో లాభం పొందినవాళ్లలో కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు మొదట ఉంటుంది. వైఎస్ చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాత్రం వీళ్ల ఆటలు సాగలేదంటారు. అందుకే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ అవకాశవాద తెలంగానం విన్పించారని టాక్, ఆ తర్వాత ఎన్నికల సమయంలోనూ టిఆర్ఎస్ పార్టీనేతలు వీళ్లని పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ పడనీయలేదట. ఐతే ఇప్పుడు అధికారానికి దూరంగా మసలడం కోమటిరెడ్డికి అస్సలు సహించలేకపోతున్నారట. కనీసం అధికార పార్టీలో అన్నా ఉంటే ఆ సిచ్యువేషన్ వేరు, అందుకే ఇప్పుడు కేసీఆర్ భజన చేపట్టాడు. అందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాకుగా దొరికింది. 

ఎవరూ చేయనట్లు 3 గంటలు ప్రజెంటేషన్ ఏంటి అబ్బా అసలు దేశంలోనే ఎవరూ ఇలా చేయలేదంటూ తెగ మోసేశారు కేసీఆర్ ని కోమటిరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణలో చతికిలబడిపోయిన దశలో నేతలంతా పార్టీ మారారు. మళ్లీ రేపైదైనా బ్యాచ్ మొదలు పెడితే, తనకి బెర్త్ దొరకడం కష్టం అనుకున్నారో ఏమో ముందే భజన మొదలుపెట్టారని. ఇంకో రెండు మూడు నెలల్లో జంపై, మంత్రి పదవి లేదంటే ఏదోక కార్పొరేషన్ పదవైనా పట్టుకునాలనేది ఈయన టార్గెట్ గా నల్గొండ జనం గుసగుసలాడుకుంటున్నారు.
At the time of KCR ruling Komati Reddy is upper hand, now he is trying to jump into TRS. He is chanting KCR name.