కోడెలకి సన్ స్ట్రోక్

6 Apr 2016


ఏపీ స్పీకర్ కోడెల కు తన కొడుకు నుంచే చిక్కులు ఎదురవుతున్నాయ్. వాస్తవం ఏంటో తెలీదు కానీ శివరామకృష్ణపై ఎప్పుడూ ఆరోపణలు వస్తూనే ఉంటాయ్. అతని సొంత ఊరు నరసరావుపేటలో కేబుల్ టివీ వ్యాపారంలో ప్రత్యర్ధులపై దాడి చేయడం, వారి వ్యాపారాన్ని కబ్జా చేయడం దగ్గర్నుంచి చుట్టుపక్కల భూదందాల్లో అతని హస్తం ఉందని చాలాసార్లు ఆరోపణలు వచ్చాయ్. ఇప్పుడు స్పీకర్ నియోజకవర్గం సత్తెనపల్లిలో వెన్నాదేవిలో తమ పొలాన్ని లాక్కునేందుకు శివరామకృష్ణ ప్రయత్నిస్తున్నాడంటూ కొందరు రైతులు గుంటూరు జిల్లా ఎస్పీని కలవడం టిడిపిలో కలకలం రేపుతోంది. స్పీకర్ గా ఎలాంటి వివాదాలు లేకుండా బాధ్యతలు నిర్వర్తించాలి.

ఐతేఇక్కడా ఆయనకి ప్రతిపక్షం రూపంలో ఆరోపణలు వస్తుండగా, ఇప్పుడు కొడుకుపై ఇలాంటి విమర్శలు కేసులు రావడం, ఇబ్బందే ఇది గిట్టనివారి పనిగా కొట్టిపారేయాలని చూసినా క్షేత్రస్థాయిలో చూస్తే వాస్తవాలు వేరుగా కన్పిస్తున్నాయ్. ఎప్పట్నుంచో సాగుచేసుకుంటున్న పొలాన్ని తాము కొన్నామని చెప్పడం ఖచ్చితంగా వారి దౌర్జన్యాన్నే సూచిస్తోంది. జిల్లా స్ధాయి అధికారి దృష్టికి రైతులు కేసుని తీసుకెళ్లారంటే కాస్తో కూస్తో వారి వాదనను కూడా పట్టించుకోవాల్సి వస్తుంది. ఇదే అంశం కోడెలకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందంటున్నారు.
AP speaker Kodela Siva Prasad is always hot topic in media. In land dealings and cable business. Now his son is also becoming topic in media.