కేశవాయ స్వాహా!

13 Apr 2016


అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు, చైనా బ్యాచ్ తామనుకున్నది సాధించారు. కేశవరెడ్డి విద్యాసంస్థలను మూయించడంలో సఫలీకృతులయ్యారు. పైగా తాము ముందు స్కెచ్ వేసినట్లే చైతన్య కళాశాలలో విలీనమయ్యేలా చేయించుకున్నారు. ప్రభుత్వం దాన్ని తీసుకుంటే అది ఓ పధ్దతి, కానీ శ్రీచైతన్య కాలేజ్ యాజమాన్యానికి అప్పగించడమే పైన చెప్పిన సందేహాలకు బలం చేకూర్చుతోంది. గత కొన్నినెలలుగా కేశవరెడ్డి స్కూళ్లలోని అక్రమాలపై కొన్ని ఛానళ్లలో పుంఖానుపుంఖాలుగా స్టోరీలు వచ్చేవి. ఏదో ఆ ఛానళ్లకి మాత్రమే ఈ ఘోరాలు తెలిసినట్లు సీరియల్ సిరీస్ గా డ్రైవ్ నడిపేవారు. కేశవరెడ్డి స్కూళ్ల బిజినెస్ తమ విద్యా వ్యాపారానికి అడ్డుగా మారిందనే ఇలా ప్రభుత్వంలోని ఓ ప్రముఖుడు స్టోరీలు రాయించి వండించి టివీ ఛానళ్లలో ప్రసారానికి పెయిడ్ ఆర్టికల్స్ గా పంపేవాడంటారు.

వాళ్లనుకున్న లక్ష్యం నెరవేరడంతో ఇప్పుడు తమ ఎడ్యుకేషన్ బిజినెస్ ఇంకాస్త వర్ధిల్లుతుందని ఈ బ్యాచ్ సంతోష పడుతోంది. ఐతే మధ్యలో బుక్కైంది మాత్రం పేరెంట్స్ మాత్రమే, ఎందుకంటే స్కూళ్లలో చదువు కోసం డిపాజిట్ల రూపంలో బోలెడంత డబ్బు పోగొట్టుకుంది వాళ్లే. ఇప్పుడా డబ్బు కూడా చైతన్య మేనేజ్ మెంటో, ప్రభుత్వమో ఇవ్వగలిగితే మంచిది. అది కానప్పుడు మరి బలైంది విద్యార్ధుల తల్లిదండ్రులే కదా..!
Once upon a Kesava Reddy Educational Institutes. Now they are not at there, One of the TDP minister did all this for his business development.