కట్టప్ప బాహుబలిని చంపలేదట

14 Apr 2016


రాజమౌళి బాహుబలి సినిమాతో ఓ ప్రశ్నని జనానికి వదిలిపెట్టగా అది ఇంటర్నెట్ లో తిరుగుతూనే ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని, ఇదో సినిమాటిక్ క్వశ్చెనే అయినా అదో పెద్ద అవసరమైన ప్రశ్నలా పెతోడూ అడగడం కామనైపోయింది. డీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి, ఈ కథ రాసిన విజయేంద్రప్రసాద్ ని కూడా ఇదే ప్రశ్న అడగగా కాస్త ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడాయన. హూ నోస్ ఇంకా బాహుబలి బతికే ఉన్నాడేమో అంటూ ఇచ్చిన ఆన్సర్ తో నెట్ లో మళ్లీ హే బాహుబలి కంక్లూజన్ తో ప్రభాస్ చనిపోలేదని చూపుతారంటూ కామెంట్లు చేస్కుంటున్నారు.

ఇదో పెద్ద విషయమే కాదు, ప్లాష్ బ్యాక్ ముగిసిన తర్వాత ప్రజెంట్ ట్రెండ్ లో అతను బతికిరావడం కామనే కదా..! పైగా రానా క్యారెక్టర్ అనుష్కతో.." చచ్చేలోగా చూడాలని నువ్వు, మరోసారి చంపాలని నేను ఎదురు చూస్తూనే ఉన్నాం" అంటాడు కదా. సో ఇలాంటి జిమ్మిక్కులు మనం పాత సినిమాల్లో చాలా చూశాం లైట్ తీస్కోండి బాస్.
Baahubali Movie created sensation world wide. It got best National Award also. At the same time a question "Why Kattappa killed Baahubali", is also famous. For this Rajamouli father Vijayendra Prasad revealed the answer.