వచ్చేస్తున్నాడు కబాలి

20 Apr 2016


ఏప్రిల్ లో విడుదల కావాల్సిన కబాలి, కనీసం మే వరకైనా వచ్చేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తైందట, ఇక డబ్బింగ్ పనులు జోరందుకున్నాయ్. సూపర్ స్టార్ డబ్బింగ్ మొత్తం రెండ్రోజుల్లో పూర్తే చేసే అవకాశం కన్పిస్తోంది, ఐతే వారం రోజులు పడుతుందని ముందుగా ఫిక్స్ చేస్కున్నారు. డాన్ క్యారెక్టర్లో రజని కన్పించడం ఇది మూడోసారి, కెరీర్ బిగినింగ్ లో ఓసారి భాషా, తర్వాత ఇప్పుడు కబాలి. ఐతే ఇదంతా ముంబై వెళ్లి అక్కడ అండర్ వరల్డ్ ని షేక్ చేసిన హాజీ మస్తాన్ కథో, లేక మొదలియార్ స్టోరీనో, తెలీదు కానీ పాత చిత్రాల ఛాయలు ఖచ్చితంగా కన్పిస్తాయ్. కథ కొత్తదా, పాతదా కాదు నేరేషన్ లో కొత్తదనం, సినిమాలో పంచ్ డైలాగ్స్ తో పాటు, ఆకాశాన్ని అంటే హీరోయిజం, ఓ నాలుగు టాప్ సాంగ్స్ ఉంటే చాలు రజనీ సినిమా హిట్టైనట్లే అని ఓ ఫార్ములాగా చెప్తారు. కానీ రీసెంట్ గా మాత్రం రోబో తర్వాత పెద్దగా పే చేయకపోవడంతో రజనీ పూర్తిగా భిన్నంగా కన్పించేలా కొత్త సినిమాలో ట్రై చేశాడని టాక్.
Rajanikanth Kabali movie shooting is completed and doing dubbing work. Actually it is scheduled to release in April, but still shooting work is not completed.