ఈ బుద్ది అప్పుడేమైంది

17 Apr 2016


తెలుగు రాష్ట్రాలు అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకుని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలన్నారు సీఎం కేసీఆర్‌. అన్ని విషయాల్లో ఏపీకి సాధ్యమైనంత వరకు సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఆయన, అనవసర గిల్లికజ్జాలు పెట్టుకుంటే ఇరు రాష్ట్రాలకు నష్టమేనన్నారు. మరి ఇంత తెలివిడి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏమైందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి అంశానికి కోర్టు దాకా వెళ్లడం అక్కడ మొట్టికాయలు వేయించుకున్న తర్వాతే కేసీఆర్ లో ఈ మార్పు కన్పిస్తుందంటున్నారు. ఉమ్మడి రెవెన్యూ షేరింగ్, ఉన్నత విద్యా మండలి షేరింగ్, ఏపీ వాహనాలకు టిఎస్ రిజిస్ట్రేషన్, ఎంట్రీ ట్యాక్స్, విద్యుత్ ఉద్యోగుల విభజన. ఇలా ప్రతి అంశంలో గిల్లికజ్జాలు పెట్టుకున్న కేసీఆర్ దాంతో తనకి అచ్చివచ్చేది, కలిసి వచ్చేది లేకపోవడం వల్లనే ఇప్పుడు శాంతికపోతంలా మారిపోయాడనేది సుస్పష్టం.

దుమ్ముగూడెం నుంచి నీటిని ఏపికి వదులుతామంటున్న  కేసీఆర్‌, తెలంగాణ వెయ్యి టీఎంసీల నీటిని వాడుకున్నా, 1500 టీఎంసీల నీరు ఏపీకి వెళ్తుందన్నారు. ఐతే ఇది రెండు వైపులా ఉండాలని కూడా చెప్పడం వెనుక రహస్యం తెలియాల్సి ఉంది. అక్కడికి ఈయనగారేదో భిక్షం వేసినట్లు నీళ్లిస్తాననడం, ఇవతలి వాళ్లు తీసుకోవడం ఏం ఉండదు. ఎవరి వాటా వారికి భౌగోళిక అనుకూలతల ద్వారా వద్దన్నా వస్తాయ్ అంతే!
Telangana CM KCR recent comments are giving shock. He is saying both states are must be with understanding. We will give water to AP from Dhammugudem.