హవ్వ..మీరా వెన్నుపోట్లపై మాట్లాడేది?

2 Apr 2016


దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అని ఓ సామెత చెప్తుంటారు. వేదాలనేవి ఎంతో పవిత్రమైనవి, నిగూఢమైనవి, ఎవరికి పడితే వారికి అలవాటు కానివి అలాంటి వాటిని దెయ్యాలు పలకడం అంటే అది కుదిరే పని కాదు కదా. ఆ ఏంగిల్ లో ఈ సామెతను వాడుతుంటారు. ఇప్పుడు మేనమామ అల్లుళ్లు కేసీఆర్, హరీష్ అదే పని చేయబోతున్నారట. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రావాల్సిన ఓట్లు రాలేదని, దానికి కారణం టిఆర్ఎస్ లోని కొంతమంది వెన్నుపోటు పొడవడమే కారణమని వీరిద్దరూ నిర్ధారణకు వచ్చారట. అందుకే వారిపై వేటేసేందుకు రెడీ అయ్యారట
మరి. నిస్సిగ్గుగా దాదాపు పదిహేనుమంది  ఎమ్మెల్యేలను పక్కపార్టీలనుంచి తమ గూటికి చేర్చుకున్నప్పుడు ఈ వెన్నుపోటుల గురించి ఆలోచించొద్దా, తాము చేస్తే సంసారం.. ఎదుటోడు చేస్తే వ్యభిచారం ఎందుకవుతుందో వీళ్లిద్దరే చెప్పాలి. 

అది ఏ పార్టీ అయినాగానీ, జంప్ జిలానీలను చేర్చుకున్నప్పుడు లేని నీతి, తమ పార్టీలో వెన్నుపోటు పొడిస్తే ఎందుకు గుర్తు వస్తుందో చెప్పాలి మరి. టిఆర్ఎస్ బలం కాదు వాపు  అని గ్రేటర్ వరంగల్ ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ప్రూవ్ చేసింది. ఐతే అధికారం చేతిలో ఉన్నప్పుడు పక్క పార్టీలకు ఆహ్వానాలు పలికితే రాకుండా ఎవరు ఉంటారు. అంత మాత్రాన వాళ్లేదో అభివృధ్ది చేసినట్లు, అది చూసి వారంతా జంపవుతున్నట్లు ఎవరూ నమ్మరు. అలాంటిది తమ పార్టీలో వెన్నుపోటు పొడిచినప్పుడు  ఎందుకంతగా ఈ మామా అల్లుళ్లు గింజుకుంటున్నారో తెలీదు మరి.
Telangana CM KCR and his nephew Harish Rao is talking about Warangal elections results. In Warangal elections some of TRS leaders jumped into other parties.