నెహ్రూ జంప్

12 Apr 2016


నేను పదవులను వెతుక్కుంటూ వెళ్లను, అవే నన్ను వెతుక్కుంటూ వస్తాయ్ అంటూ బీరాలు పలికే జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరిపోయారు. ఈయన పార్టీఫిరాయించక ముందు అసెంబ్లీలో బండబూతులు మాట్లాడారని టిడిపి నేతలు తెగ వాపోయారు. ఇప్పుడు తమ పార్టీలో చేరగానే అవన్నీ మంత్రాలవుతాయి కాబోలు మరి. వైఎస్సార్సీపీ నుంచి జంపైన ఎమ్మెల్యేలంతా తమ అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పగా, నెహ్రూ మాత్రం వైసీపీ పరణతి చెందలేదంటూ చెప్పడం గమనార్హం. 

మెచ్యూరిటీ గురించి మాట్లాడే నెహ్రూ తన ఫిరాయింపులపై మాత్రం మాట దాటేస్తూ, ఏదో తాను అధికార పార్టీలో ఉండటమే ప్రజల అభివృధ్దికి నిదర్శనమని నమ్మబలుకుతుంటారు. చిరంజీవి సిఎం అయితే బిసిలకు రాజ్యాధికారం వచ్చినట్లే అని ఎలాంటి పనికిమాలిన స్లోగన్ ఇచ్చారో. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ కూడా తనకి మంత్రి పదవి దక్కడమే ప్రజలకు సేవ చేయడమనుకోమంటారు. ఐతే చంద్రబాబు పదవి ఇచ్చినప్పుడు కదా ఎవరి పరణతి ఏంటో తెలిసేది అని ఇప్పటికే కామెంట్లు బయల్దేరాయ్.
YSRCP MLA Jyothula Nehru jumped into TDP. He was said that, i dont want cabinets. But for that only he entered into TDP.