నెహ్రూ మరోసారి పార్టీ మారితే

12 Apr 2016


నేనిన్ని రోజులు వైఎస్సార్సీపీలో ఉన్నా, ఇంట్లో మాత్రం ఎన్టీఆర్ బొమ్మే ఉంది. ఇదీ జ్యోతుల నెహ్రూ డైలాగ్. అసలు నువ్వెందుకు పార్టీ మారావ్ అంటే రకరకాల కామెంట్లు, సమాధానాలు చెప్పే ఈ లీడర్లు తాము ఏ ఎండకి ఆ గొడుగు ఎలా పడతారో చెప్పడానికి నెహ్రూ తాజా కామెంటే ఉదాహరణ. ఎన్టీఆర్ ని అభిమానించడం, టిడిపిలో చేరడానికి ప్రాతిపదిక అయితే తెలంగాణలో చాలామంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరాల్సి ఉండేది. అదేదో అర్హతలా చెప్పడం ఎలా నిలబడుతుంది నెహ్రూ..? నెహ్రూ చెప్తున్నదాని ప్రకారం ఆయన  ఇంట్లో ఇంకా చాలా బొమ్మలు ఉండే ఉండాలి. కాంగ్రెస్ ఒకప్పటి అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, దివంగత సిఎం వైఎస్సార్, జగన్ ఇలా ఫోటోలు పెట్టుకుంటేనే రేపు పార్టీ మారినతర్వాత చెప్పుకోవడానికి మరో అవకాశం ఉంటుందని జనం అంటున్నారు.

తానెందుకు టిడిపి మారానో ఓ సందర్భంలో జ్యోతుల నెహ్రూ చెప్తూ వైఎస్ సిఎంగా ఉన్న సమయంలో కేబినెట్ మంత్రిగా ఉన్న జక్కంపూడి కుర్చీలోంచి కదల్లేని స్థితిలో ఉన్నా, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మంత్రిగా కొనసాగించిన సహృదయం రాజశేఖర్ రెడ్డిదని, ప్రభుత్వ ఖర్చులతో చికిత్స విదేశాల్లో కూడా చేయించారని. అదే చంద్రబాబు తాను అనారోగ్యంతో జిల్లా  పార్టీ అధ్యక్షుడిగా కొన్ని రోజులు బాధ్యతలనుంచి తప్పించుకుంటే తర్వాత పూర్తిగా తప్పించేశాడని నెహ్రూ వాపోయాడు. అప్పుడే వైఎస్ వైపు టిడిపినుంచి వెళ్లిపోయానని చెప్పారు నెహ్రూ. అలాంటి చంద్రబాబు మనస్తత్వం ఇప్పుడెలా మారిందో నెహ్రూ కే తెలియాలి.
Jyothula Nehru responded for his party change into TDP. He is telling i am big fan of NTR. So for NTR i changed party.