జానా మాట ఎవరికి పట్టింది

17 Apr 2016


తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేత జానారెడ్డి  తమ మనోగతం విన్పించారు. మామూలుగానే ఆయన మాటలు ఎవరికీ అర్ధం కావంటారు, ఇప్పుడు పార్టీ నుంచి జంపైతున్న నేతలపై ఆయన మాట్లాడింది వింటే మతిపోవడం ఖాయం. ఫిరాయింపుదార్లపై ఏకంగా ప్రధానికే కంప్లైంట్ చేస్తానని చెప్పాడీయన  టీఆర్‌ఎస్‌లో చేరిన డీకే సోదరుడు చిట్టె రామ్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలని దేబిరించడం ఎందుకు. ఇప్పుడంతా జంప్ జిలానీల కాలం ఇలాంటి సమయంలో ఎవరు గట్టిగా నే చివరిదాకా పార్టీతోనే ఉఁటా  అన్నారో, వారంతా ఖచ్చితంగా పార్టీ మారతారని అర్ధం.

అలాంటిది పార్టీ ఫిరాయింపులపై ఎందుకు అనవసరంగా కంఠశోష ఎవరైతే ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ స్టాండ్ విన్పిస్తున్నారో వారు రేపు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి ఎరుక. పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తూ చేసిన చట్టం ఇటీవలి కాలంలో అభాసుపాలవుతోందని అంటున్న జానారెడ్డి తానూ అలా పార్టీలు మారిన సంగతి ఎందుకు మర్చిపోతారో ఆర్ధం  కాదు. ఐతే ఈయన మాటలను పెద్దగా పట్టించుకోవక్కర్లేదని అనేవాళ్లూ ఉన్నారు.
Telangana Congress leaders Jana Reddy comments are creating funny. Now he is talking i will complaint about MLAs who are jumping into another parties.