ఎట్టకేలకు పెళ్లికుదిరింది

18 Apr 2016


తెలుగు సినిమా చరిత్రలో పోష్ ఇమేజ్. యూత్ లో ఓ  బిల్డప్ ఇచ్చే బ్యాచంటూ తయారైంది రామ్ గోపాల్ వర్మ్ బ్యాచ్ తోనే, ఐతే ఆయనకి అంతకు ముందే  పెళ్లై ఉండటంతో తర్వాత విడిపోయాడు కానీ. మిగిలినోళ్లకి పెళ్లంటే ఎవర్షన్ లా బిల్డప్ ఇస్తూ, తెరచాటు సంబంధాలు మాత్రం కానిచ్చేస్తుండేవాళ్లు. ఆ బ్యాచ్ లో జేడీ చక్రవర్తి కూడా ఒకళ్లు, శివ సినిమాలోని క్యారెక్టర్ పేరునే ఇంటిపేరులా మార్చేసుకున్న చక్రవర్తి పూర్తి పేరు నాగులపాటి శ్రీనివాసచక్రవర్తి. మనీ సినిమాకోసం పాటలు కూడా పాడాడితను, ఆ సినిమాలోని పాటలానే మనోడు బ్యాచ్ లర్ లైఫ్ నే కోరుకున్నాడిన్నాళ్లూ. ఐతే ఇప్పుడు మనోడు పెళ్లి చేసుకోబోతున్నానంటూ మీడియాకి ఇంటర్వ్యూలు  ఇచ్చేస్తున్నాడు.

నాలుగేళ్లలో యాభైఏళ్లకు దగ్గరపడిన జేడీకి ఈ వయస్సులో అమ్మాయి దొరకడం నిజంగా గొప్ప విషయమే. ఇతగాడి సమకాలీకుడు కృష్ణవంశీకూడా ఇదే  వయసులో పెళ్లాడాడు. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనే తల్లి కోరిక అంటూ చెప్తున్నాడు కానీ, ఇప్పుడు కొత్తగా సెటిల్ అయ్యేదేముంటుంది. కాకపోతే వారసత్వం  కొనసాగించడానికి మాత్రం పెళ్లి అవసరమే. ఏదైతేనేం ఒకప్పుడు యూత్ లో మాంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉన్న జేడీ దాన్ని పోగొట్టుకోవడం కూడా అతని స్వయంకృతాపరాధమే. ఇప్పుడు అడపా దడపా సినిమాల్లో కన్పిస్తున్నా, పెద్దగా యూజ్ ఉండట్లేదు చివరాఖరికి మనోడు చేసుకునే పిల్ల రంభలాగ రంజుగుంటదా, రమ్యకృష్ణలాగుంటదా అంటూ సినీ జనం గుసగుస లాడుకుంటున్నారు.
Siva fame artiest JD Chakravarthi got more popularity with that movie. Later she did so many characters, and he did movies as hero. And he did movie as director. Now he is going get marriage.