పవన్ కాంగ్రెస్ లో చేరతాడా

3 Apr 2016


లీడర్లు లేక, క్యాడర్ చచ్చిన కాంగ్రెస్ మళ్లీ బతుకుతుందా.. ఈ ప్రశ్న కాంగ్రెస్ నేతలను తెగ బాధిస్తోంది. ఐతే ఏ పార్టీకైనా చావు బ్రతుకులు ఉండవ్, ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీలు చావడమనేది అరుదుగానే జరుగుతుంది. ఎందుకంటే 125 ఏళ్ల కాంగ్రెస్ కి ఇలాంటి ఆటుపోటులు ఎన్నో ఎదుర్కొంది, కాకపోతే ప్రతీ చోటా ప్రతి దశలో పార్టీ లీడర్లను తయారు చేసింది. ఆ తర్వాత తయారయ్యారు కానీ వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ లో ఛరిష్మా కూడా చచ్చిపోయింది. ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న నేతలు రావాలంటే ఇంకో దశాబ్దం పడుతుంది. అంతకంటే ఎక్కువే పట్టొచ్చు పార్టీ అధికారంలోకి రాకుండా ఎన్నేళ్లైనా మనుగడ  సాగిస్తుంది కానీ చావడం మాత్రం జరగదు. ఇది కన్ఫామ్ ఐతే ఇప్పుడు కాలికి బలపం చెవికి శంఖం పెట్టుకుని ఏపిసిసి ప్రెసిడెంట్ రఘవీరారెడ్డి తెగ వెతుకుతున్నా లీడర్లు రావడం లేదు, ఐటెమ్ సాంగ్ లో మెగాస్టార్ ఉన్నా అది ఆకర్షణ వరకే తప్ప అధికారానికి పనికి రావడంలేదు. 

ఐతే అందుకే ఆ పార్టీ మాస్టర్ ప్లాన్ వేస్తుందట, ఇది ఆ పార్టీ నేత చింతా మోహన్ చెప్తున్నాడు. ఇది నిజమో కాదో కానీ, పవన్ కల్యాణ్ ని పార్టీలోకి ఇన్వైట్ చేస్తామని చెప్తున్నారు. ఐనా ఆయన కూడా ఐటెమ్ సాంగ్ లా వచ్చిపోయేవాడే కానీ, నిలబడేవాడు కాదని ఇప్పటికి చాలాసార్లు ప్రూవైంది. అంతటితో ఊరుకోకుండా మరో నేత జగన్ ని కూడా రమ్మంటామన్నారు. అసలు అది జరిగే పని కాదు ఎందుకంటే 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బంగారు భవిష్యత్ ఉన్న నేత భస్మాసుర హస్తం అందుకునే ఛాన్స్ లేదు. అంతగా అయితే ఏదోరోజు కాంగ్రెస్ మద్దతు తీసుకోవచ్చు కానీ, పార్టీ మారడం జరగదు. ఐతే చింతామోహన్ చెప్పినట్లు పవన్ కల్యాణ్  ఏమైనా మంచి ప్యాకేజీతో కాంగ్రెస్ ముందుకు వస్తే ఆ దిశగా ఆలోచన చేయొచ్చని కొందరంటారు, చూద్దాం ఇది నిజంగా చింతా ఆలోచనో, లేక కాంగ్రెస్ హైకమాండ్ ప్లానో..!
In AP and all over India after 2014 elections congress party has no life. But in AP congress leaders are trying to give birth to Congress, for that they are tying to invite Pavan Kalyan into Congress.