ప్రీమియర్ స్టైల్ లీగ్ గురూ

20 Apr 2016


ఇండియన్‌  ప్రీమియర్‌  లీగ్‌.. ఐపీఎల్‌  వచ్చాక, మనదేశంలో క్రికెట్‌  కున్న క్రేజ్‌  మరింత పెరిగిందనడటంలో ఎలాంటి డౌట్‌   లేదు. పరిమిత ఓవర్లలోనే విజయం సాదించేందుకు ప్రతీ ప్లేయర్‌   బాల్‌ను బాదేయడమే లక్ష్యంగా, పోరాటం చేస్తాడు ఇంతవరకు ఓకే.. మరి ఐపీఎల్‌లో ఓన్లీ క్రికెట్‌ మాత్రమే కాదు. ఆ సీజన్‌లో  ఏ ఆటగాడెక్కువ అట్రాక్ట్‌   చేశాడనేది కూడా పాయింటే. అది మ్యాచ్‌   విన్నర్‌గానా..?, లేక తన స్టైల్‌తోనా..? అన్నదే లేటెస్ట్‌   కాన్సెప్ట్‌. సో.. ఈ సారి ఐపీఎల్‌లో చాలా మంది క్రికెటర్స్‌, స్పెషల్‌  హెయిర్‌  స్టైల్స్‌తో ఆటాడేస్తున్నారు. ఐపీఎల్  అంటే ఓన్లీ క్రికెట్‌  కాదనే మీనింగ్‌  అందరికీ అర్థమైపోయింది. ప్రీమియర్‌  లీగ్‌  వచ్చాక బాల్‌  బ్యాట్‌తో పాటే, ఎక్ట్రా ఎంజాయ్‌  మెంట్‌  వచ్చిపడింది. అందులో చీర్‌  గాల్స్‌  కూడా ఒకటి.

అలాంటి మినీ క్రికెట్‌  కుంభమేళాగా పేర్కొనే ఐపీఎల్‌లో, అన్ని దేశాలకు చెందిన ప్లేయర్స్‌ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా, తమ స్టైల్‌  మార్క్‌ను కూడా చూపిస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో కూడా మన క్రికెటర్స్‌, స్పెషల్‌  లుక్‌తో వచ్చేశారు. గ్రౌండ్‌లో ఆల్‌రెడీ దూసుకుపోతున్న టీమ్‌లో స్పెషల్‌  లుక్‌  ఇస్తున్న వారు ఒకరిద్దరు కంపల్సరీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ సారి ప్లేయర్స్‌ చాలామంది ట్రెండీ హెయిర్‌  స్టేల్స్‌ను ఫాలో అవుతున్నారు.  ఒకప్పుడు పొడుగు జుత్తుతో ఆటాడే ధోనీ, హఠాత్తుగా చిన్న క్రాఫ్‌  తో కనిపించాడు. ఈ సారి కూడా మంచి బాలుడు టైప్‌లో, క్రాఫ్‌  చేయించుకుని ఆటాడేస్తున్నాడు.  లేటెస్ట్‌  ఫ్యాషన్‌  కు ఐకాన్‌గా మారిన విరాట్‌ మరోసారి ట్రెండీ హెయిర్‌  లుక్‌తో వచ్చేశాడు. ఇప్పటికే రకరకాల హెయిర్‌  స్టైల్స్‌తో ఆటాడేస్తున్న కోహ్లీ, ఈ సారి స్పెషల్‌  లుక్‌తో అట్రాక్ట్‌  చేస్తున్నాడు, హార్డిక్‌  పాండ్య కూడా రఫ్‌  లుక్‌తో ఎట్రాక్ట్‌  చేస్తున్నాడు. ఇటు ఇషాంత్‌  శర్మ కూడా పొడగాటి జుత్తుతోటే ఆటాడేస్తున్నాడు. 
Again IPL season is started in India. IPL is not only famous for cricket, now it is famous for different styles and trend sets. In this season also our players are ready with different dress and different stylises.