నా టాలెంట్ చూపిస్తా

4 Apr 2016


కేథరిన్ తెరిసా ఇద్దరమ్మాయిలతో చేసిన హుషారైన క్యారెక్టర్ తో తెలుగులో మంచి రేంజ్ కి వెళ్తుందనుకున్నారు, ఐతే అటు తమిళ్, ఇటు తెలుగులో ఏ ఒక్కచోటా ఆమెకి సరైన గుర్తింపు దక్కలేదు. పుట్టిన గడ్డ మళయాళంలోనే ఈ  కేరళకుట్టి ఆటలు సాగుతున్నాయ్. ఐతే అక్కడ ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ లేదు, సౌండ్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అదే తెలుగో, తమిళ్ లోనో మంచి క్యారెక్టర్ పడి హిట్టైతే రెమ్యునరేషన్ కోట్లకి చేరుతుంది. అందుకే ఈ పాప ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా చూడండి అంటోంది. ఐతే అందుకు తగ్గ క్యారెక్టర్లు మాత్రం పడటం లేదని తెగ ఇదవుతోంది.

పైసా ఛమక్ చల్లో సినిమాల తర్వాత వచ్చిన ఇద్దరమ్మాయిలతో అట్టర్ ఫ్లాప్, అప్పట్నుంచీ తెలుగులో మరి సెకండ్ హీరోయిన్ అదీ కాదంటే కన్పించి మాయమైపోయే క్యారెక్టర్లే దక్కాయ్. రుద్రమదేవిలో తప్ప ఈ మధ్య తెరపై కన్పించలేదు. అల్లు అర్జున్ స్పెషల్ ఇంట్రస్ట్ చూపించబట్టే, ఇప్పుడు సరైనోడులో ఓ క్యారెక్టర్ చేయగలిగింది. కనీసం ఈ సరైనోడన్నీ కేథరిన్ టాలెంట్ ని సరిగా చూపించగలిగితే ఇండస్ట్రీని ఊపేయవచ్చని కలలు కంటోంది కేథరిన్ తెరిసా.
After Edharamayilatho Katherin Therisa has no movies in Tollywood and she dont have movies in Kollywood also. She is doing movies in Malayalam only. Now she is doing a character in Sarainodu movie.