హాలీవుడ్ కి పోదట

4 Apr 2016


బాలీవుడ్ లో ఓ రేంజ్ పేరు రాగానే నెక్స్ట్ హాలీవుడ్డే మా టార్గెట్ అని, ఆల్రెడీ మాకు  ఆఫర్లున్నాయని తెగ బిల్డప్స్ ఇస్తుంటారు. మల్లికాశెరావత్, బిపాషాబసు లాంటోళ్లు ఓ నిమిషం పాటు కన్పించే క్యారెక్టర్లు చేసి తామూ హాలీవుడ్ లో నటించామనిపించుకున్నారు కూడా. ఐతే నలక నడుము కరీనా మాత్రం అసలు ఇంగ్లీష్ ఫీల్డ్ కి వెళ్లే ఛాన్సే లేదని చెప్తోంది తనకా ఇంట్రస్టే లేదంటోంది. అసలు హిందీ సినిమాలనే ప్రపంచం అంతా చూస్తుంటే, నేనిప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఇంగ్లీష్ సినిమాలు చేయాలంటోంది ఎవర్ స్లిమ్మింగ్ బ్యూటీ కరీనా. పైగా హాలీవుడ్ లో చేయాలంటే డెడికేషన్ కావాలని అంటూ మరో బాంబ్ పేల్చింది. 

అంటే ఇప్పుడు హిందీ సినిమాలు చేసేవాళ్లకు డెడికేషన్ అవసరం లేదనా కరీనా కామెంట్ కి అర్ధం. అదటుంచితే కరీనా కపూర్ బాడీ పర్ఫెక్ట్ హాలీవుడ్ బ్యూటీలానే ఉంటుంది. బికినీ వేయడంలో, కళ్లతోనే హోయలు ఒలికిస్తూ మత్తెక్కించేలా నటించడంలో కరీనా స్టైల్ వేరు. అందుకే  ఆమె  హాలీవుడ్ కి వెళ్తే ఖచ్చితంగా షైనయ్యేది. కొద్దిగా చబ్బీ బేబే లా కన్పించే ప్రియాంక చోప్రాతో పోల్చుకుంటే కరీనానే సిల్కిగా ఉంటుంది. ఐతే ఇప్పుడు కరీనా తనకు హాలీవుడ్ కి వెళ్లాలనే ఇఁట్రస్ట్ లేదనడంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఓ వైపు ఉస్సూరంటూ మరోవైపు హిందీలో ఆమె అందాలు చూడొచ్చనుకుంటూ సంబరపడుతున్నారు.
All top Bollywood heroins are tying to do movies in Hollywood. But Bollywood hot heroin Katrina Kaif is telling, i dont want to go Hollywood.