పాలిటిక్స్ అంటేనే తెలీదట

18 Apr 2016


సినిమా స్టార్లన్నా, వారి లైఫ్ స్టయిలన్నా వేరే లోకంలా  ఉండటం  సహజం. ఐతే మరీ ఫోటో ఐడీ, ఓటర్ ఐడీ అన్నా కూడా తెలీకుండా ఉంటుందా. ఔననే అంటోంది కేథరిన్ చేసిన ఐదు తెలుగు సినిమాల్లో మూడు అల్లు అర్జున్ తోనే చేసిన కేథరిన్, సరైనోడులో ఓ ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిందట. డైరక్టర్ బోయపాటి శ్రీనివాస్ ఏం చెప్తే అదే చేశానని, అంతే తప్ప రాజకీయాలపై తనకి అస్సలు అవగాహన, పరిజ్ఞానం లేవంటూ చెప్తోంది తెల్లపిల్ల. పైగా ఇందులో రెండు పాటలకు సూపర్ డ్యాన్స్ కూడా చేసిందట.

ఎమ్మెల్యే డాన్సాడితే ఎలా ఉంటుందో సరైనోడులో చూపిస్తారేమో. చూడబోతే సినిమా ఏదో గతంలో రాజశేఖర్ మీనా కాంబినేషన్ లో వచ్చిన అంగరక్షకుడిలా ఉంటుందేమో అని టాక్ బయల్దేరింది. సినిమాలో బన్నీ డ్యాన్స్ అదుర్స్ అని ప్రతి ఎక్స్ ట్రా అవర్ కి ఎక్స్ట్రా  ఆర్డినరీగా డ్యాన్స్ చేయడంలో అతని తర్వాతే ఎవరైనా అంటూ కితాబులిచ్చేస్తోంది కేథరిన్. సెకండ్ హీరోయిన్ గా చేయడమంటే పెద్దగా ఫీలయ్యేది  ఏముందని, ఎవరి ఇంపార్టెన్స్ వారికి ఉంటుందంటూ ముక్తాయింపునిచ్చేసింది.
Tollywood heroin Katherin Therisa did five movie in Telugu, in that five movie she three movie with Allu Arjun. Now in Sarinodu movie she did a MLA character, and a song.