హన్సిక ఇంకా మెచ్యూర్ అవలేదట

4 Apr 2016


దేశముదురు తర్వాత తెలుగులో హిట్లే ఎరగని భామ హన్సిక మోత్వానీ. అడపా దడపా కన్పిస్తూ తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్న హన్సిక అక్కడ  అందరూ పెద్దహీరోలతోనే చేస్తోంది. దీనిపై కంప్లైంట్ కూడా ఉంది. చిన్న హీరోలను అసలు పట్టించుకోదని, రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతూ వాళ్లని డిజప్పాయింట్ చేస్తుందని టాక్. ఐతే ఇదే విషయం అడిగితే మాత్రం హీరో సంగతి తెలీదు కానీ కథే ముఖ్యం అని బిల్డప్ ఇస్తుంది.

సినిమా ప్రమోషన్ కూడా ముఖ్యమే అంటూ ఆ కార్యక్రమాలకు వచ్చే హన్సిక వాటికి సెపరేట్ రేటు తీసుకుంటుందట. రిలీజైన తర్వాత వాటి జయాపజయాలు కూడా తెలుసుకుంటూ ఉంటుందట హన్సిక. ఏదైనా హిట్టైతే తెగ సంబరపడిపోయే హన్సిక, ఫ్లాపైతే మాత్రం చాలా ఫీలవుతుందట. నేనింకా చిన్నపిల్లనే అని ఫ్లాప్ హిట్ రెండింటినీ  ఒకటిగా తీసుకునేంతగా నేను మెచ్యూర్ అవలేదంటూ కుండబద్దలు కొట్టేసింది హన్సిక.
Heroin Hansika has no hits in telugu after Desamudhuru movie. Now she is doing movies in Kollywood. And she prefer to do movies with big heroes only.