మెంటల్ ఉండదు

28 Apr 2016


టైటిల్ నచ్చలేదంటూ కోర్టుకెక్కడం దాంతో సినిమాల రిలీజ్ ఆపడమనేది. దాదాపుగా ఈ మధ్య కాలంలో లేదు. ఐతే ఆ సిచ్యుయేషన్ ఇప్పుడు పోయి పోయి శ్రీకాంత్ మెంటల్ పోలీస్ కి రావడమే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా తయారైంది. ఎందుకంటే మనోడి సినిమాలు ఈ మధ్య రావడంలేదు, అలాంటిది ఇప్పుడు రిలీజ్ కి ముందు  హైకోర్టుకు వెళ్లడం స్టేట్ పోలీస్ సంఘాలు అడిగిన వెంటనే, కోర్టు రిలీజ్ ని ఆపడం నిర్మాతలతో పాటు శ్రీకాంత్ కి షాకే
లేటెస్ట్ డెవలప్ మెంట్స్ తో కిందికి దిగివచ్చిన నిర్మాతలు అసలు ముందు సినిమా చూడండి, చూసిన తర్వాత ఇంకా అభ్యంతరం ఉంటే, టైటిల్ మార్చుతామంటూ చెప్పుకొచ్చారు.

ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, పోలీసులతో పెట్టుకుంటే ఎలా మరి వీడేం పోలీస్, మెంటల్ పోలీస్ లాంటి టైటిళ్లు టీవీ ఛానళ్లలో నడిచిపోతున్నాయ్, కానీ సినిమాలకు మాత్రం పెట్టనివ్వడం లేదు పోలీస్ సంఘాలు. ఐతే నిజానికి పోలీసుల్లో ఎక్కువమంది అవినీతిపరులు, లంచగొండులు ఉన్నారు. ఇలా అన్నందుకు కేసులు పెడితే పెట్టొచ్చుకానీ, టీవీ ఛానళ్లలో చూపిస్తున్న వడ్డీ రెడ్డి భాగోతం, కీచక ఎస్సై భాగోతం వాటికి నిదర్శనం కాదా. సగటు మనిషి పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే భయపడతారంటే దానికి వాళ్ల ప్రవర్తనే కారణం. ఐతే సినిమాలో ఏం ఉందో చూడండంటూ ఆహ్వానించిన తర్వాతైనా పోలీస్ సంఘాలు మెత్తబడతాయేమో చూడాలి.
Srikanth movie Mental Police is not yet released. High court gave stay on this movie. Telugu states police unions filed case against this movie title.