సుమంత్ దండయాత్ర

14 Apr 2016


నువ్ చూడూ చూడకపో.. నే తీస్తూనే ఉంటా టైపులో కొంతమంది తెలుగుహీరోలు ప్రేక్షకులపైకి దండయాత్ర చేస్తూనే ఉంటారు. ఆ కోవలో ప్రధమంగా తారకరత్నని చెప్పుకుంటే, ఆ తర్వాత నారా రోహిత్ ఉండగా, వీళ్లకి బాబులాంటి హీరో ఒకరు ఈ మధ్య మిస్సయ్యారు ఆయనే సుమంత్. అలుపూ సొలుపూ  లేకుండా సినిమాలు తీసి ప్రస్తుతం రెస్ట్ తీస్కుంటున్న సుమంత్ మళ్లీ ఓ సినిమాతో ఆడియెన్స్ కి ఎటాక్ ఇవ్వబోతున్నారు. 

ఏమో గుర్రం ఎగరావచ్చు తర్వాత తాత ఏఎన్ఆర్ మరణం సంభవించింది. అప్పట్నుంచీ తెరకి దూరంగా ఉన్న సుమంత్ ఇప్పుడు విక్కీ డోనర్ అనే హిందీ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాట్ట. మల్లిక్ రామ్ అనే దర్శకుడు దీన్ని డైరక్ట్ చేస్తుండగా, మే నెల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. నాగ్ తో విబేధాలు వచ్చాయని టాక్ ఉన్న నేపధ్యంలో ఈ సినిమా ఎలాంటి కుటుంబసభ్యుల హడావుడి లేకుండా విడుదల కావచ్చని అంటున్నారు.
Hero Sumanth has no movie now. He has no hits in Tollywood. Again he is doing Bollywood movie remake. After ANR passed away he has no movies.