సుమన్ ఎంట్రీ ఖాయం

11 Apr 2016


నటుడు సుమన్ ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యాడు. మనోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంత హుషారు చూపిస్తున్నాడు ఇప్పుడు. అసలు బిసిలంటూ సభలు పెట్టుకుంటే ఎక్కడికైనా నేనొస్తానంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నాడంటే సుమన్ నెక్ట్స్ ఇక యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటరవుతాడనే అన్పిస్తోంది.

అందుకే ఓయూ క్యాంపస్ దగ్గర ఓయూజేఏసీ,  బిసి జేఏసీలు పెట్టిన సభకి హాజరై, ఫక్తు పొలిటికల్ ప్రసంగం చేశాడు సుమన్. జ్యోతిరావ్ పూలే జన్మదినాన్ని నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. గతంలో టిడిపిలో ఉన్న సుమన్, ఇప్పుడు టిఆర్ఎస్ వైపు  అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సభకి హాజరైన విహెచ్, టిడిపి ఎల్ రమణ, బిజెపి లక్ష్మణ్ తో క్లోజ్ గా మూవ్ అవడం గమనించిన వాళ్లు ఇక సుమన్ ఏదోక పార్టీలో చేరడం ఖాయమంటున్నారు.
Now Hero Suman is taking active role in Politics and all meetings. Recently in OU students meeting he took lead role. So his next step is Political entry.