ఈయన ఇంకా తీస్తానంటున్నాడు

4 Apr 2016


రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, సైనికుడు, వరుడు, రుద్రమదేవి ఇవి డైరక్టర్ గుణశేఖర్ తీసిన వాటిలో అందరికీ తెలిసినవి. మొదటి సినిమా లాఠీ అవార్డు ఫిల్మ్, తర్వాత రాజశేఖర్ తో ఎవడైతే నాకేంటి పేరుతో ఓ సినిమా మొదలుపెట్టినా, ఇద్దరి మధ్యా గొడవతో డైరక్టర్ ని మార్చేయడంతో కుమిలిపోయాడతను. ఇప్పుడెందుకు ఈ హెడ్డింగ్ అంటే మనోడు రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్రుడు తీస్తున్నానని చెప్పాడు, మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎక్కడా ఎవరూ చెప్పుకోకపోవడంతో, లాభం లేదనుకుని మళ్లీ గుణ లీకులు ఇవ్వడం మొదలెట్టాడు. ప్రతాపరుద్రుడికి సంబంధించిన చరిత్ర గురించి ఈ ఆర్నెల్ల నుంచి తెగ వెతుకులాట చేశాడట.

హిందూ మహాయుగం అనే బుక్ దొరికిందని, అందులో ప్రతాపరుద్రుడి గురించి అంతా ఉందని చెప్తున్నాడు గుణ. మరి ఇంతక ముందు చేతిలో ఏ స్క్రిప్టూ లేకుండానే ఆ ప్రకటన చేశాడనుకోవాలి. బౌండ్ స్క్రిప్ట్ పూర్తయ్యేసరికి మళ్లీ మరో మూడు నాలుగు నెలలు పడుతుందేమో ఐనా చారిత్రక కథలపై మోజు పడే హీరోలు తక్కువ మనకి ఏ బాలయ్య దగ్గరకో వెళ్లి సదరు కథని విన్పిస్తే గుణశేఖర్ కి సగం రిస్క్ తగ్గుతుందని కొంతమంది ఫీలింగ్. అటు శాతకర్ణి, ఇటు ప్రతాపరుద్రుడు ఈ రెండూ ఒకేసారి చేయగల సత్తా బాలయ్యకి ఉంది కదా..! ఐతే తాను ప్రతాపరుద్రుడు వదల్లేదని చెప్పడానికే ఈ లీకులు ఇస్తున్నాడని కూడా గుణపై టాక్ ఉంది.
In Tollywood directors Guna Shekar is also one of the popular director. Recently he did Rudramma Devi movie. Now he is going to do Prathapa Rudrudu movie.