ఇదేనా తెలుగుదనం

28 Apr 2016


చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉంటే మనం చేసే పనిలో చిత్తశుద్ది లోపిస్తుంది. అది ఫైనల్ ప్రాజెక్ట్ పై ఎఫెక్ట్ పడుతుందంటారు. ఇప్పుడు గౌతమీపుత్రశాతకర్ణి విషయంలో ఆర్భాటం చూస్తుంటే అదే అనాలనిపించకమానదు. ఎందుకంటే ఇది తెలుగు రాజు కథ, తెలుగువారందరిని ఏకఛత్రం కింద పాలించిన రాజు కథ, అంటూ బాలయ్య తెగ ఊదరగొట్టాడు. ఐతే మరి దానికి రివర్స్ లో పని చేస్తున్నారు ఈ యూనిట్. ఫస్ట్ షాట్ అమరావతి ఒడ్డునో, కృష్ణమ్మ తీరానో చేసి ఉంటే స్పాట్ యాంబియన్స్ అదిరిపోయి ఉండేది. కానీ అలా చేయలేదు, తెలుగంటేనే పెద్దగా లెక్క చేయని, తెలుగుతల్లిపై అనేక విమర్శలు చేసిన కేసీఆర్ చేతులపైగా జరిగింది.

ఆయనపై మాకు వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ తెలుగురాజు కథని ఎక్కడో నిజాం నవాబుల గడ్డపై చేయడం ఎందుకు, సరే అది వదిలేద్దాం, ఇప్పుడు నిజంగా నువ్ సెట్ వేయాలనుకుంటే తెలుగురాష్ట్రాల్లో ఎక్కడ లేవు. నాగార్జున కొండపై వేయకూడదా, అది కాదని చెప్పి మొరాకో దేశంలో శాతవాహనుల రాజధాని సెట్ వేయడం ఎంత దారుణం. ఎక్కడో పరాయి దేశంలో తీసి అచ్చ తెలుగు చక్రవర్తి కథ అంటూ విడుదల చేసే ముందు ఓసారి చిత్తశుద్దితో తీస్తే, ఆ ప్రయత్నానికి ప్రజల మద్దతు దానంతట అదే వస్తుంది.
Balakrishna 100 movie Gouthamiputra Sathakrni movie shooting started recently. Balakrishna is always saying, this is telugu story, telugu movie. But they are doing this movie shooting in Foreign countries.