గొట్టిపాటి కలకలం

28 Apr 2016


జంప్ జిలానీల యవ్వారం ఏదో టిడిపి కొంపముంచేదిగానే ఉంది. .పర్టిక్యులర్ గా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గోడ దాటిన వ్యవహారం చూస్తే అసలు కరణం బలరాంని చిక్కుల్లోకి నెట్టేందుకే పార్టీలో చేరినట్లుంది కానీ. పైకి చెప్తున్నట్లు నియోజకవర్గ అభివృధ్ది, కేసుల భయం కాదని అనుకుంటున్నారు. పార్టీ లో చేరిన గొట్టిపాటి రవికుమార్ ఎట్టి పరిస్థితుల్లో తాను కరణం వర్గీయులతో కానీ, కరణం బలరామ్ తో కానీ కలిసేది లేదని స్పష్టంగా చెప్పేశాడు. అటు కరణం కూడా ఆ సభకి దూరంగా ఉన్నాడు. సభకి హాజరైన టిడిపి జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్ధన్ కూడా అంటీ ముట్టనట్లే ఉన్నాడు. 

అలా కండువా కప్పిన మరుక్షణంలోనే తనని చుట్టుముట్టిన గొట్టాల ముందు క్లియర్ గా తన టార్గెట్ ఏంటో చెప్పిన గొట్టిపాటి రవి, జగన్ పై మాత్రం  ఒక్క విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం. అటు కరణం బలరామ్ మాత్రం ఉన్నది అధికారపార్టీలో, అక్కడ్నుంచి ప్రతిపక్షపార్టీలోకి వెళ్లే అవకాశం లేదు. ఇక చేసేదిలేకే, టిడిపిలో కొనసాగేందుకు సిధ్దపడ్డారంటున్నారు. ఐతే టైమ్ వస్తే మాత్రం తన తఢాఖా అటు చంద్రబాబుతో పాటు, టిడిపికి కూడా చూపిస్తాడని ఆయన నైజం తెలిసినవాళ్లంటున్నారు. అందుకే జంప్ జిలానీల యవ్వారం చివరికి అసలుకే ఎసరు పెట్టేలా ఉందని పార్టీ కేడర్ గుబులు పడుతోంది.
Continuously opponent party MLAs joining into TDP. It is very problematic to TDP party. Especially Prakasham District MLA recently joined in TDP. It looking like to get TDP into problems.