రకుల్ కి ఇల్లెవరిచ్చారు..?

20 Apr 2016


చూడగానే ఆకట్టుకునే కళ్లు, హొయలు ఒలికించే వళ్లు, ఫర్ ఫెక్ట్ ఫిగర్ మెయిన్ టైన్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఇప్పుడు టాలీవుడ్ లో అందరికీ ప్రీతిగా మారిపోయింది. ఐతే తనని గ్లామర్ డాల్ గా మాత్రమే పిలవడంపై చిరు కోపంగా ఉందామె. అన్ని రకాల పాత్రలు చేస్తుంటే ఏదో అందరు హీరోయిన్లలా ఎందుకు నన్ను పిలుస్తున్నారంటూ ఫీలైపోయింది. అలానే మెగా కాంపౌండ్ లోనే వరస సినిమాలు దక్కడంపై కూడా గాసిప్స్ ని పట్టించుకోవద్దంటోంది. అదేం ప్లాన్ చేయలేదని, అలా కుదిరిపోయాయని చెప్తోందీ సొట్టబుగ్గల పోరి. 

వరసగా వస్తున్న ఆఫర్లతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ లోనే ఓ ఫ్లాట్ కొనేసుకుంది కూడా..! ఇక్కడే అమ్మడిపై గుసగుసలు మొదలయ్యాయ్, ఎవరో బాయ్ ఫ్రెండ్ కొనిచ్చారంటూ వచ్చిన గాసిప్స్ పై మండిపడింది. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇల్లని, దాన్నెవరో గిఫ్ట్ గా ఇచ్చారనడం దారుణమని చెప్పింది. పైగా 45 పేరుతో ఓ జిమ్ ఫ్రాంచైజీ కూడా తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్, అది బాగా రన్నవుతోందని చెప్తోంది. నిజంగా రకుల్ మంచి బిజినెస్ లేడీ అనడంలో డౌట్ లేదు మరి.
In Tollywood Rakul Preet Singh is going with hits. She the only heroin who get two movie with mega family. Recently she stared a business in Hyderabad, and she baught a flat in Hyderabad.