కన్ఫ్యూజన్ లో ఎక్కువ గాలి

12 Apr 2016


టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నా అనుకుంటూ తానే గందరగోళంగా మాట్లాడేస్తుంటాడని టాక్. జ్యోతుల నెహ్రూ పార్టీ మారిన సందర్భంలో ప్రశ్నలకు గాలి సమాధానాలు చూస్తే అది నిజమే అన్పించకమానదు. ఫిరాయింపుదారులను ఎందుకు పార్టీలో చేర్చుకుంటారంటే, అడ్డదిడ్డంగా మాట్లాడేశారీయన. పైగా జగన్మోహన్ రెడ్డి  తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరితే, ఎందుకు ప్రశ్నించరని మంత్రులైనా టిఆర్ఎస్ ను ఎందుకు విమర్శించడం లేదంటూ ఏదేదో మాట్లాడతారు గాలి. 

ఫిరాయించిన ఎమ్మెల్యేలచేత రాజీనామాలు చేయిస్తారా లేదా అనే ప్రశ్నకు అయితే ఔనని, లేదంటే లేదని చెప్పాలి కానీ తెలంగాణలో మావాళ్లను లాక్కున్నారు. మీరెందుకు మాట్లాడరంటూ అడగడంలో  ఔచిత్యమేంటో మరి..! పనిలో పనిగా తన బాకా జాబ్ ని కూడా వెలగబెట్టేశారాయన. లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ తన స్వామిభక్తిని ప్రదర్శించారు. అసలు లోకేశ్ కి మంత్రి పదవి ఎందుకో జనానికి చెప్పగల ధైర్యం లేదు కానీ, ఎదుటి పార్టీ వాళ్లపై విమర్శలెందుకు చేస్తున్నారో కనీసం గాలికైనా తెలుసా..?
TDP MLA Gali Mudhukrishnama Naidu talks about YSRCP MLAs joing into TDP is very funny. He is not talking clearly about this.