ఏంటీ హామీలు

12 Apr 2016


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అక్షరాలా హామీల వర్షమే కురుస్తోంది. మిక్సీలు, ఫ్యాన్లు, గ్యాస్ స్టవ్వుల నుంచి ఏసీ వరకూ ఉచితంగా ఇచ్చేస్తామంటూ ఓటరును ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయ్ పార్టీలు. ఈ ప్రజాకర్షక అనుచిత ఉచిత వాగ్దానాలకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. ఎదుటివారు ఒకటిస్తే, తాము రెండిస్తామనే రేంజ్ లో ఈ వాగ్ధానాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తమ ప్రకటనలతో ఊదరగొడుతున్న కరుణానిధి, జయలలిత కొన్ని రోజుల్లో తమ ఫుల్ ప్లెడ్జెడ్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. 

అసలు తమిళనాట పార్టీలతో సంబంధం లేకుండా, ఫ్రీగా ఇస్తామనే మాట విన్పించకపోతే గెలుపు గుర్రం దక్కదనే సెంటిమెంట్ ఉంది. 1962 లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజర్‌ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇలా ఆయన దేశంలోనే 'మధ్యాహ్న భోజన పథకానికి ఆద్యుడిగా చెప్తారు. తర్వాత ఎంజీ రామచంద్రన్‌  1982, జులై 1న మరోసారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.  అప్పట్లోనే సంవత్సరానికి ఈ పథకానికి 120 కోట్లు ఖర్చైందట, తర్వాత ఏడాదికి ఇది 220 కోట్లకి చేరింది. కామరాజర్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఓడించటానికి పోరాడిన డీఎంకే నేత అన్నాదురై కూడా 1967 లో రూపాయికి కిలోబియ్యం ప్లాన్ ప్రవేశపెట్టారు. ఇది వారికి విజయాస్త్రంగా పని చేసింది. గత పదేళ్లలో డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు అమలు చేసిన మూడు ప్రధాన పథకాలు తమిళనాడు రాష్ట్రాన్ని చావుదెబ్బ తీశాయంటారు. కరుణానిధి ఫ్రీగా కలర్‌ టీవీలు, జయలలిత ఫ్రీగా  టేబుల్‌ ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు,  ల్యాప్‌టాప్‌ల ఇచ్చేశారు. ఇవి ఎవరికి దక్కాయనే అంశం పక్కనబెడితే ఖర్చు మాత్రం 15,817 కోట్ల రూపాయలై తడిసి మోపెడైంది. ఇదే డబ్బును సరిగా వాడితే 25 వేల పాఠశాలల భవనాలు, 11 వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నెలకొనేవంటారు.

కరుణానిధి తన హయాంలో ఉచిత పథకాల అమలు కోసం లక్ష కోట్ల అప్పు చేశారు. జయలలిత హయాంలోనూ అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి. గత ఆర్థిక సంవత్సరం తమిళనాడు అప్పుల భారం 2 లక్షల 11 వేల కోట్లు!ఇది మన తెలుగు రాష్ట్రాల బడ్జెట్ తో సమానం. వీళ్లిద్దరూ పంపిణీ చేసిన  కలర్‌ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్‌లు, ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లను దక్కించుకున్నోళ్లు బైట మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు. మరికొన్ని నల్లబజారుకూ తరలుతున్నాయి. ఇప్పుడు కరుణానిధి మళ్లీ నెలకు 20కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తామంటున్నారు.ప్రసూతి సెలవు 9నెలల వరకూ పెంచుతామని మహిళలను ఆకట్టుకునేందుకు మరో హామీ గుప్పించారాయన..అలానే రాష్ట్రంలోని 750చేనేత వర్గాల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా కరుణానిధి చెప్తున్నారు

వాయిస్() ఇక 2006 శాసనసభ ఎన్నికల్లో గెలుస్తామో లేదోనన్న అనుమానంతో డీఎంకే నేత కరుణానిధి అనూహ్యమైన ఉచిత పథకాలు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. మేనిఫెస్టోలో ఆయన మొత్తం 122 పథకాలు అనౌన్స్ చేసి వాటిని పూర్తి చేయడంతో రాష్ట్ర ఖజానాకి భారీగా నష్టం వాటిల్లింది

 కరుణానిధి ఫ్రీ కలర్ టీవీలకు 3,340కోట్ల రూపాయలు ఖర్చవగా.. ఒక కోటి 52లక్షల టీవీసెట్లు పంపిణీ చేశారు. ఉచితంగా ధోవతిలు చీరెల పంపిణీకి 1219కోట్లు ఖర్చుచేసారు..గ్యాస్ కనెక్షన్లను 3లక్షలమందికి ఫ్రీగా పంపిణీ చేయగా దానికి 660కోట్ల రూపాయల ఖర్చైందట..అలానే సహకార బ్యాంకుల వద్ద రైతులు తీసుకున్న లోన్లు మాఫీ చేసి ఖజానాపై 6866కోట్ల రూపాయల భారం మోపారు కరుణానిధి..ఫ్రీ సైకిళ్ల పథకంతో అటు జయలలిత..ఇటు కరుణానిది ఇప్పటికి 300కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని నిపుణులు అంచనా వేశారు
కరుణానిధి ఉచిత కలర్‌ టీవీ పథకం, రూపాయికే కిలో బియ్యం పథకం అస్త్రాలతో 2006లో ఘోరంగా దెబ్బతిన్న జయలలిత ఆ తర్వాత మేలుకున్నారు. 2011 శాసనసభ ఎన్నికల్లో కరుణానిధిని మించి.. ఫ్రీ మంత్రం పఠించారు..ఎన్నికల్లో గెలవడంతో ఇక ఆ పంథా వీడకుండా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మిక్సీ ఫ్యాన్లు గ్రైండర్లు ఫ్రీగా 1కోటి 85లక్షల మహిళలకు పంపిణీ చేయగా వదిలిన చేతి చమురు 7వేల7వందల 55కోట్ల రూపాయలు.. ఫ్రీ ల్యాప్ టాప్ లు 31.76 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసిన జయ ప్రభుత్వం  దానికోసం  4722.79 కోట్లు ఖర్చు పెట్టింది 

ఇక అమ్మ డ్రింకింగ్ వాటర్ పథకం కింద మినరల్ వాటర్ బాటిల్ ని పదిరూపాయలకే అందించగా..ప్లాంట్ల స్థాపన కోసం 7324కోట్ల రూపాయలు వ్యయమైందని అంచనా జయలలితకు బాగా పేరు తెచ్చిన పథకం అమ్మ కేంటీన్ రూపాయికే ఇడ్లీ..ఐదు రూపాయలకు పొంగల్ ఇస్తూ పేదలకు ఆహారం అందిస్తున్నా వ్యయం మాత్రం ఏడాదికి రెండున్నరకోట్ల రూపాయలవుతున్నాయ్
అమ్మ సైకిళ్లు.. అమ్మ బేబీకిట్స్ , అమ్మ ఆవులు.. మేకలు ఇలా ప్రతీ పథకానికి అమ్మ పేరు జోడించి కోట్లలో ఖర్చు పెట్టేస్తున్నారు అమ్మ సెల్ ఫోన్లు..అమ్మ ఉప్పు.అమ్మ పప్పు ఇలా ప్రతీదీ అమ్మ నామమే.. ఈ రాయితీల భారం 45వేలకోట్లుగా అంచనా వేశారు..అంటే మన ఆంద్రప్రదేశ్ నూతనరాజధాని నిర్మాణ వ్యయంతో సమానం లేదంటే పోలవరం ప్రాజెక్టుతో సమానం..వీటితో పాటు ఇప్పుడు మద్యపాన నిషేధం కూడా తమిళపార్టీల మేనిఫెస్టోలో చేరిపోయింది..ఇన్నిన్ని హామీలు ఇచ్చినంత మాత్రం గెలుస్తారని కాదు కానీ..గెలిచిన ప్రతిసారీ ఆ పార్టీ ఈ హామీల అండతోనే గట్టెక్కామనే భ్రమలో ఉంటున్నారు.
Tamilnadu state hot with elections campaign and elections promises. All parties leaders are giving free offers to voters.