బదిలీ(ల)లు

18 Apr 2016


సర్కారు పోస్టుల్లో ట్రాన్స్ ఫర్లంటే చాలా వ్యవహారాలు నడుస్తుంటాయ్. తమ పోస్టులు కదలకుండా ఉండటానికి, కావాల్సిన పోస్టుల్లో కుదురుకోవడానికి చేతులు భారీగా తడుస్తుంటాయంటారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం టిటిడిలో చేసిన స్థాన చలనాలపై విమర్శలు విన్పిస్తున్నాయ్. టి‌టి‌డిలో ముఖ్య భూమిక పోషిస్తున్న డిప్యూటీ ఈవో స్థాయి అధికారులలో కొందరికి స్థానచలనం కలిగింది. ధీర్గకాలికంగా ఒకే శాఖలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఉన్నతాధికారులను వేరే శాఖలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో అన్ని విభాగాల్లోనూ బదిలీలు పర్వం కొనసాగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు.

అయితే టీటీడీ, శ్రీవారి ఆలయ భాగోగులు, పరిపాలన వ్యవహారాలు, భక్తుల సౌకర్యాలు చూసే ధార్మిక సంస్థ. ఏటా 2వేల కోట్లు పైబడి బడ్జెట్ కలిగిన టి‌టి‌డి పరిపాలన వ్యవహారాలను చూసేందుకు ప్రభుత్వం ద్వారా  ఏర్పాటు అయిన టి‌టి‌డి మొదట్లో మానవ సేవే మాధవ సేవ అంటూ భక్తులకు సేవ చేస్తూ వచ్చింది. గత కొద్ది కాలంగా లాంగ్ స్టాండింగ్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు టి‌టి‌డి ఈవో సాంబశివరావు పూనుకున్నారు. ధీర్గకాలంగా ఒకే విభాగంలో పనిచేస్తున్న ఉనాతాధికారులకు స్థాన చలనం చేశారు టీటీడీ ఈవో. ఎక్కడా ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావులేకుండా ఉండేందుకు రెండు సంవత్సరాల పైబడి విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఈవో స్థాయి అధికారులకు స్థాన చలనం చేసేందుకు పూనుకున్నారు.

ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో డిప్యూటీ ఈవోగా విధులు నిర్వహిస్తున్న చిన్నంగారి రమణను తిరుచానూర్ అమ్మవారి ఆలయానికి, అక్కడ విధులు నిర్వహిస్తున్న చెంచులక్ష్మిని తిరుమల నిత్యాన్నదాన పధకానికి, ఇక్కడ పనిచేస్తున్న వేణుగోపాలును మార్కెటింగ్ విభాగానికి బదిలీ చేశారు. అలాగే రిసెప్షన్-1 డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న కోదండ రామరావును శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా నియమించారు. అంతే కాకుండా రిసెప్షన్-1 బాద్యతలను రిసెప్షన్-2 విభాగాధిపతి హరీంద్రనాధ్’కు అప్పగించారు. వీరిలో చిన్నంగారి రమణ, చెంచులక్ష్మిపై అనేక ఆరోపణలు వచ్చాయ్. ఇప్పుడు వారిని వేరోచోటికి బదిలీ చేయడం వెనుక ఏదో ప్రబలమైన కారణం ఉండే ఉంటుందని అంచనా. అంతే కాకుండా మరో రెండు మూడు రోజులలో టి‌టి‌డిలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు స్థాన చలనం కలగనున్నట్లు తెలుస్తోంది.
Tirupathi Devastanam is famous for all over India. But is hot topic in media. In TTD recently transfers was happen. But in this transfers, corruption was happen.