పాలేరు ఎవరో

18 Apr 2016


నిత్యం ఏదోక ఎన్నిక రగడ ఉండనిదే తెలంగాణలో పొద్దు గడవనట్లుంది నేతల తీరు, ఖమ్మం జిల్లా పాలేరులో మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఆ సీటుకి బై ఎలక్షన్ తప్పదు. మామూలుగా అయితే ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. కానీ ఇక్కడ సానుభూతి పాలిటిక్స్ ని పక్కనబెట్టి ప్రతి పార్టీ బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నాయ్. దీంతో ఏకగ్రీవం కాకుండా పోటీ తప్పదని తేలింది. పాలేరు నియోజకవర్గంలో మంచి ప‌ట్టున్న సీపీఎం పార్టీ మాత్రం బ‌రిలోకి దిగేందుకు నిర్ణ‌యించుకుంది. వైసీపీ మ‌ద్ధ‌తుతో, క‌లిసివ‌స్తే సీపీఐ స‌హాకారం తీసుకొని ఎన్నిక‌ల పోటీకి దిగాలని బావిస్తోంది. దీంతో అధికార టీఆర్ఎస్ కూడా బ‌రిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. జిల్లా నేతలతోపాటు కొత్త గా పాలిటిక్స్ లోకి రావాల‌నుకుంటున్న వాళ్లు ఎంద‌రో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో మాంచి గిరాకీ ఏర్పడిందీ సీటుకి. పాలేరు సీటు త‌న‌కు కేటాయించాల‌ని సీనియ‌ర్ నేత గ‌ట్టు రామచందర్ రావు కోరుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న టీఆర్ఎస్ పెద్ద‌లంద‌రికీ త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేశార‌ట‌. వైసీపీ నుంచి జంప్ కొట్టిన ఈ పొట్టి నేత  లెఫ్ట్ రాజ‌కీయాలు, అందునా ఖ‌మ్మం జిల్లా స్థితిగ‌తులు తెలిసిన స్థానిక నేత కోటాలో ఆయ‌న టికెట్ ఆశిస్తున్నారు. అధికార పార్టీ అండ ఉంటే త‌న‌కున్న ప‌రిచ‌యాలు, లోక‌ల్ సపోర్టుతో పాలేరును దున్నుతాడట గట్టు.

ఖ‌మ్మం ఎంపీ సీటుకి పోటీపడి ఓడిన టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్య‌క్ష‌డు బేగ్ కూడా మ‌రో చాన్సు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఎంతో కాలంగా ఖ‌మ్మం జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్ గా ప‌ని చేస్తున్న నూక‌ల న‌రేష్ రెడ్డి కూడా త‌న‌కో చాన్సు ఇవ్వాల‌ని కోరుతున్నారు. డోర్న‌క‌ల్ జ‌న‌ర‌ల్ స్థానంగా ఉన్నంత కాలం అక్క‌డ నుంచి పోటీ చేసిన నూక‌ల న‌రేష్ రెడ్డి, ఆ త‌ర్వాత ఖ‌మ్మం రాజ‌కీయాల మీద దృష్టిపెట్టారు. మంత్రిగా కొన‌సాగుతూ, ఎమ్మెల్సీగా నామినేట్ చేయ‌బ‌డిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును పాలేరు బ‌రిలో నిలుపుతార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మరోవైపు పాలేరు టికెట్‌ను ఒక్క టీఆర్ఎస్ నేతలే కాదు, ఇత‌ర పార్టీల నేత‌లు కూడా గులాబీ పార్టీ టికెట్ కోరుతున్నారు. ఈ మ‌ధ్యేకాలంలోనే ఖ‌మ్మం జిల్లాలో ప్ర‌ముఖ నేత‌గా ఎదిగిన ఓ ప్ర‌జా ప్ర‌తినిధి కూడా త‌న త‌మ్ముడికి పాలేరు సీటు కేటాయించాల‌ని టీఆర్ఎస్ తో మంత‌నాలు సాగిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తాను, త‌న వెంట‌ మ‌రో ప్ర‌జాప్ర‌తినిధిని టీఆర్ఎస్ లోకి తీసుకొస్తాన‌ని, పాలేరు సీటు త‌న త‌మ్ముడికి కేటాయించాల‌ని లింక్ పెట్టాడట. కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి సోదరుడు మాజీ మంత్రి దామోద‌ర్ రెడ్డి బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. అదే కుటుంబానికి చెందిన రాంరెడ్డి మ‌రో సోద‌రుడు లేదా ఆయ‌న కుమారుడు కూడా టీఆర్ఎస్‌లో చేరి... పోటీకి దిగుతార‌ని తెలుస్తోంది.
Khamman district is the center of attraction for political affairs. Now again Khammam is hot topic in media. Her sitting MLA of congress was died. So for this all parites are trying for this seat.