కేసీఆఫ్ ఫీవర్

18 Apr 2016


టైటిల్ చూసి ఇదేదో ఆయనంటే క్రేజ్ అనుకునేరు, నిజంగానే ఆయనకి జ్వరమొచ్చిందట. ఇంకేముంది మూడురోజుల పాటు అన్నీ బంద్, అయ్యగారు ఫామ్ హౌస్ లో మూడ్రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు. నవమి పండగ రోజునుంచే ఆయనకి హెల్త్ బాలేదని చెప్తున్నారు. అసలు మామూలుగానే కేసీఆర్ హెల్త్ కండిషన్ అంత గొప్పది కాదని, ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని కొద్దిరోజులుగా ప్రచారం ఉంది. అందుకే ఆయన ఎక్కువ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటారని వేరే  పార్టీలనేతలు విమర్శిస్తుంటారు.

అఁదులో నిజానిజాలు దేవుడికే తెలియాలి కానీ, ప్రస్తుతం మాత్రం సార్ కి ఫీవర్. పోయిన శుక్రవారం భద్రాచలం వెళ్లిన కేసీఆర్‌.. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పట్నుంచి కేసీఆర్‌ జ్వరంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. జ్వరం ఎక్కువగా ఉండటంతో రెండు, మూడు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట.
KCR is going to guest house to take rest. From last three days he is suffering from fever. So doctors suggested him to take rest.