మిస్ ఇండియా

12 Apr 2016


ప్రియదర్శిని ‘మిస్ వరల్డ్ ప్రియదర్శినీ చటర్జి, ఈ ఏడాదికి  ఫెమినా మిస్‌ ఇండియా స్టార్ గా ఎంపికైంది. ఈ ఏడాది 2016 మిస్‌ వరల్డ్‌ పోటీకి మన దేశం నుంచి పోటీ  పడే అవకాశం కూడా అలా దక్కించుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. బెంగళూరుకు చెందిన సుశ్రుతి క్రిష్ణా తొలి రన్నర్‌పగానూ, లఖ్‌నవ్‌కు చెందిన పాన్గుడి గిడ్వానీ రెండో రన్నర్‌పగానూ నిలిచారు. కళ్లు చెదిరేలా సాగిన ఈ ఈవెంట్ కి సంజయ్‌దత్, మనీష్‌ మల్హోత్రా, అర్జున్‌కపూర్‌, అమీ జాక్సన్‌, సానియా మీర్జా తదితరులు జడ్జీలుగా వ్యవహరించారు.

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డైరక్టర్ జొహార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెమినా మిస్ ఇండియా కంటెస్ట్ కి  యామీ గౌతమ్, కబీర్‌ఖాన్, అమీ జాక్సన్, ఏక్తా కపూర్, మిస్ వరల్డ్ 2015 మిరియా లాలగునా, డిజైనర్లు మనీష్ మల్హోత్రా, షేన్ పీకాక్ లు కూడా హాజరై సందడి చేశారు. ఫుల్ జోష్ తో సాగిన ఫంక్షన్ లో  సినీతారలు వరుణ్‌ధావన్, షాహిద్ కపూర్, టైగర్ షరాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తళుకులు, సునిధి చౌహాన్ సాంగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయ్.
Mis world Priyadarsini is selected as Mis Inida 2016. Priya Darsini is born in Delhi. For this function Bollywood stars and famous models and Sania Mirza were attended.