రజనీయా మజాకా

14 Apr 2016


సూపర్ స్టార్ రజనీ క్రేజ్ కి తిరుగులేదు. ఏజ్ ఎంతైనా, మన ముందు బలాదూర్ అందుకే తన వయసువారు ముసలోళ్లై తాత క్యారెక్టర్లు చేస్తున్నా, తాను మాత్రం ఫుల్ జోష్ తో యంగ్ క్యారెక్టర్లు చేస్తుంటారు. పద్మవిభూషణ్  పురస్కారం తీసుకునే సమయంలోనూ అదే ఉత్సాహం ఆయనలో కన్పించింది. అలాంటి రజనీకి ఫ్యాన్స్ కటౌట్లకి పాలాభిషేకం చేయడం మామాలే. ఐతే ఇప్పుడు రజనీకాంత్ కి పద్మవిభూషణ్ పురస్కారం దక్కడంపై శ్రీనాధ్ బాలచంద్రన్ అనే అభిమాని 600 కేజీల చాక్లెట్ బహూకరించాడు.

అది కూడా రజనీకాంత్ రూపంలోని చాక్లెట్. ఇది కబాలి పోజ్ లో ఉన్న రజనీ కటౌట్ కావడం విశేషం. ఫ్యాన్స్ లో రజనీకి ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనంగా చెప్పాలి. సినిమా వాయిదా పడిందనే వార్తల నేపధ్యంలో ప్రస్తుతానికి ఈ  అవార్డు ప్రదానాన్నిఓ పండగలా ఫ్యాన్స్ జరుపుకుంటున్నారు.
Recently Rajanikanth taken Padma Vibhushan award form president. So fans celebrated this situation. One of the fan gave 600 kg chocolate to Rajanikanth.