పిఎఫ్ తిప్పలు..కడుపు మండిన కార్మికలోకం

20 Apr 2016


గార్డెన్‌  సిటీ రణరంగంగా మారింది. కొత్త పీఎఫ్‌  నిబంధనలపై కార్మికుల ఆందోళనతో, అట్టుడుకి పోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నిరసనలతో హోరెత్తింది. పీఎఫ్‌  ఉపసంహరణ కొత్త నిబంధనలను వెనక్కు తీసుకోవాలంటూ, గార్మెంట్‌ కార్మికుల ఆందోళన, రక్తసిక్తమైంది. ఓవైపు లాఠీచార్జీలు, మరోవైపు గాల్లోకి కాల్పులు జరపడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మరోవైపు కార్మికుల ఆందోళనపై వెనక్కు తగ్గిన కేంద్రం, కొత్త నిబంధనలను 3 నెలలు వాయిదా వేస్తన్నట్లు ప్రకటించింది.

ఇంతపెద్ద ఎత్తున నిరసన దేనికంటే ఇదివరకు ప్రావిడెంట్ ఫండ్ అనేది కేవలం యాజమాన్యం మాత్రమే కార్మికులు, ఉద్యోగుల తరపున చెల్లించేది. అది తర్వాత ఉద్యోగుల నుంచి కూడా వసూలు చేసి జమ చేయడం ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత ఈ రెండు భాగాలూ కార్మికుల నుంచే వసూలు చేసి, జమ చేసే దారుణ యాజమాన్యాలున్నాయ్. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ ఇంకో దారుణమైన పని ఏం చేసిందంటే పిఎఫ్ జమ చేసి కొన్నాళ్లు ఆపేసినా, లేక యాజమాన్య సంస్థ మారినా, మధ్యలో తీసుకోవడానికి లేదు, చచ్చినట్లు 58 ఏళ్లు వచ్చిన దాకా అక్కౌంట్లోనే ఉంటుంది. ఇక మధ్యలో ఎంత అవసరమైనా కుదిరేది లేదు, ఇదే కార్మికలోకానికి పిడుగుపాటుగా మారింది. అందుకే ఇలాంటి పనికి మాలిన నిబంధన పై మండిపడి కదం తొక్కారు.

గతంలో విత్ డ్రాయల్స్ పై బడ్జెట్ లో వడ్డీ ప్రతిపాదనలు చేసి, వెనక్కి తగ్గిన కేంద్రం ఇప్పుడు మరోసారి అదేలా వెనక్కితగ్గక తప్పలేదు. ఆగష్ట్ దాకా వాయిదా వేసినట్లు చెప్పింది. అసలు నిన్న బెంగళూరులో రోడ్లన్నీ యుద్ధాన్ని తలపించాయి. పరిసర ప్రాంతాల్లో కనబడ్డ వాహనాలను ధ్వంసం చేశారు, హెబ్బగుడి పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టారు, 15 బస్సులను తగులబెట్టారు, రోడ్లను దిగ్భందించారు, నేషనల్‌  హైవే నాలుగు పై ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. అయితే నిరసనకారులు ఎంతకూ తగ్గకపోవడంతో, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంత జరిగిన తర్వాత  కేంద్రం కొత్త నిబంధనలను మూడు నెలల పాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
EPF issue is now hot topic all over India. Yesterday in Bangalore all employees were came to road did strike, blocked NH-4. So central government, postponed order.