డ్రెస్ కోడ్ ఇన్ టెంపుల్స్

17 Apr 2016


ప్రముఖ దేవాలయాల్లోకి స్త్రీల ప్రవేశానికి ఆంక్షలు తొలుగుతున్నా, ఏదో రూపేణా వాటిని కొనసాగింపజేసేందుకు దేవాలయబోర్డులు ప్రయత్నిస్తున్నాయా, త్రయంబకేశ్వర ట్రస్ట్ తీరు అలానే ఉంది. పూజలకు వచ్చే మహిళలు తడి వస్త్రాలు లేదంటే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలంటూ నిబంధనం విధించడం వివాదాస్పదమవుతోంది. మహారాష్ట్రలోని ప్రఖ్యాత త్రయంబకేశ్వర ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ దేవస్థానం ట్రస్టు నిర్ణయించింది. ఐతే అదే సందర్భంలో మహిళలు విధిగా తడి వస్త్రాలు మాత్రమే ధరించాలని మెలిక పెట్టడంపై మహిళాసంఘాలు మండిపడ్డాయ్. కొన్ని దశాబ్దాల పాటుగా ఈ దేవాలయంలో గర్భాలయంలో మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఇటీవల చోటు చేసుకున్న  పరిణామాలతో ఆలయట్రస్ట్ బోర్డు  రోజుకు ఒక గంటసేపు మహిళలకు కూడా పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే గర్భగుడిలో పూజలు నిర్వహించేటప్పుడు విధిగా తడి వస్త్రాలు కాటన్‌వి లేదా పట్టువి ధరించాలని ట్రస్టు పేర్కొంది.

త్రయంబకేశ్వర ఆలయంలో  రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య మహిళలు గర్భగుడిని సందర్శించుకోవచ్చని. ట్రస్టీ లలిత షిండే చెప్తున్నారు. ఐతే ట్రస్ట్ బోర్డ్ విధించిన నిబంధనలపైనా స్వరాజ్య సంఘటన సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇలాగైతే తాము ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తామంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత టైమ్ దాటిందంటూ పూజారులు వారి ప్రవేశాన్ని అడ్డుకోవడంతో గొడవ మరింత ముదిరింది. తమ ప్రవేశాన్ని అడ్డుకున్నారంటూ స్వరాజ సంఘటన ఉద్యమకారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయట్రస్ట్ సభ్యులు, పూజారులు సహా 250 మందిపై కేసు నమోదు చేసారు. పోలీసులు, మహిళలపై ఆంక్షలు ఎత్తేసినట్లే పైకి కన్పిస్తున్నా ఏదోక రూపంలో తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకే ఇలా నిబంధనలు విధిస్తున్నారు మహిళాసంఘాలు ఆరోపిస్తున్నారు.
Hot topic in India is ladies entry into Temples. Recently supreme court gave orders to allow ladies into temples. But temples trusty are tying to keep this rule.