జూపల్లి..జూలో పిల్లి

17 Apr 2016


ఎందుకో తెలీదు కానీ, మాజీ మంత్రి డికేఅరుణకు ఎక్కడో కాలిందంటున్నారు. అందుకే రెండ్రోజుల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారామె. అడుక్కునైనా బతుకుతా కానీ, టిఅర్ఎస్ లో మాత్రం చేరనని చెప్పారు. దానికి కౌంటర్ ఇచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావ్ కి శాపనార్ధాలు పెట్టిందామె. పాలమూరు టెండర్లలో కావాల్సినంత బొక్కేశారని, ఇందులో కేసీఆర్ బినామీలే కాంట్రాక్టర్లంటూ ఆరోపించిన డికె అరుణ నైపుణ్యం లేనివాళ్లకు ప్రాజెక్టులు కట్టబెట్టడంలోని ఆంతర్యం అదే అని చెప్పుకొచ్చారు. పార్టీ మారనని ఆమె చెప్పడం ఉనికి చాటుకునేందుకే అని జూపల్లి ఎటాక్ చేశారు నిన్న, సిఎల్పీ పదవో, పిసిసి పదవో కట్టబెడతారనే డికెఅరుణ కామెంట్లు చేస్తున్నారంటూ జూపల్లి ఎద్దేవా చేశారు.

ఇది విన్న డికె ఇక తన అక్కసు ఆపుకోలేకపోయినట్లుంది. తమ్ముడ్ని పార్టీలోకి పిలిపించుకున్నదే కాకుండా తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంపై రెస్పౌండైన డికే, జూపల్లి జూలో పిల్లిలాంటివాడంటూ రివర్స్ ఎటాకిచ్చారు. అసలు వీళ్లంతా ఒకప్పుడు కాంగ్రెస్ లో కలిసి పనిచేసినవాళ్లే, ఐనా ఇప్పుడిలా బురదజల్లుకోవడంతోనే మామూళ్లు పంపకాల్లో తేడానేంటారు.
Ex minister D.K.Aruna is fired on TRS. She commented very hot about TRS and its ministers. They are attracting MLAs wit offers.