కరువుయాత్ర

17 Apr 2016


తెలంగాణ లో కరవు పై సమర శంఖం అంటూ కాంగ్రెస్ సిద్థం అవుతోంది. తెలంగాణ లో హైదరాబాద్ మినహ మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కరవు పరిస్దితులు తీవ్రంగా ఉన్నాయని  దానిపై స్పందిస్తే జనంలో పార్టీకి గుర్తింపు వస్తుందని టి కాంగ్ నేతలు పెద్ద ప్లానేశారు. అందుకే మొత్తం 500కి  పైగా మండలాలు ఉంటే 231 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదంటూ పార్టీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. ఇందుకోసం జిల్లాల కలెక్టర్లు కేంద్రానికి పంపిన నివేదికలను తమ వాదనకు మద్దతుగా చూపిస్తున్నారు. 

ఐతే వరస ఎన్నికల్లో చావు దెబ్బ తింటున్న కాంగ్రెస్ విమర్శలను పట్టించుకోవద్దంటూ టిఆర్ఎస్ తిప్పికొడుతోంది. ఈ సిచ్యుయేషన్ లో కాంగ్రెస్ యాత్రని జనం ఎలా రిసీవ్ చేస్కుంటారో చూడాలి. అసలే ఎండలు ఇప్పుడు బస్సుయాత్రలు పెడితే ఎండ దెబ్బకి ఢామ్మనడం ఖాయం.
In Telangana state is full with starvation. To make this situation positive to them congress is doing Yatra in Telangana state.