ఇంత హడావుడెందుకు

4 Apr 2016


మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో పెళ్ళి చేశారు. బానే ఉంది ఐతే ఇక్కడ వాళ్లనుసరించిన వ్యూహం చూస్తుంటేనే జనాన్ని ఎంత తక్కువగా చూస్తారో అన్పించకమానదు. చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ తో పెళ్లి అని మొదట్నుంచీ ఊదరగొట్టారు, తర్వాత బెంగళూర్ లో పెళ్లి, హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఐతే ఈ సందర్భంగా వీళ్లు చేస్తున్న హడావుడి చిరాకు పుట్టించకమానదు ప్రపంచంలో చాలామంది పెళ్లిళ్లు జరుగుతుంటాయ్. సెలబ్రెటీల విషయాలు జనం ఒక్కోసారి పట్టించుకుంటారు, ఒక్కోసారి పట్టించుకోరు. నిజంగా శ్రీజ రెండో పెళ్లి గురించి ఎవరికీ పట్టింపు లేదు. కావాలని ఇలా వీడియోలు విడుదల చేసి మరీ టీవీ ఛానళ్లలో ప్రదర్శించేలా చేయడం వెనుక అసలు కారణం ఏంటి. ఇకపై శ్రీజకి సంబంధించిన ఓ ప్రస్తావన వచ్చినా సెర్చింగ్ సైట్లలో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలే వస్తాయి తప్ప పాతవి రావు. చేదు అనుభవాలు అందరకీ ఎదురువుతాయ్ అంతమాత్రాన వాటి గురించే జనం మదిలో గుర్తుంచుకుని ఎల్లకాలం వాటి గురించే ఎవరూ ఆలోచించరు. పోనీ నిజంగా మీడియాపై అంత సహృదయతే ఉంటే, వాళ్లందరినీ కూడా లోపలకి  ఆహ్వానించి ఉండాలి. కానీ మొదట్నుంచీ చిరంజీవి కుటుంబం కెమెరామెన్లన్నా మీడియా అన్నా చులకనగానే చూస్తుంది. 

ఇప్పుడు రిసెప్షన్ కి ఆహ్వానపత్రాలు  పంపి, వాళ్లని గేటు బయట నిల్చోబెట్టడం నిజంగా మర్యాదస్తుల పనేనా. వాళ్లు వద్దు కానీ వాళ్లిచ్చే పబ్లిసిటీ మాత్రం కావాలి. స్టూడియో అధినేతలకు డబ్బులు పారేసో, తమ పలుకుబడి ఉపయోగించో తమకి అవసరమైన వీడియోలు ప్రదర్శించుకోవచ్చు కానీ తమ ఆహ్వానాలు మన్నించి వచ్చే జర్నలిస్టులు మాత్రం గేట్ల దగ్గర పడిగాపులు కాయాలా..? అసలు మామూలుగా మీడియాని పట్టించుకోని చిరు ఫ్యామిలీ ఈ ఈవెంట్ ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి రీజన్, శిరీష్ తో జరిగిన పెళ్లి ఇక జనం మదిలోనుంచి తొలగించడానికే అని కొంతమంది అంటున్నారు. అందుకే ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు నెగటివ్ టచ్ ఇస్తూ మెరుగైన సమాజం కోసం మురుగు పంచే ఛానల్ కూడా గమ్మునుండిపోయిందంటారు.
Recently Mega Star Chiranjeevi younger daughter Sreeja marriage was done in Benglor. To this invitations was sent to all media and later they dont allowed to function.