చిరు ఇప్పుడు రిటైర్ కాలేదా..!

11 Apr 2016


ఫిల్మ్ ఇండస్ట్రీలో హిపోక్రసీ (గొప్పలు చెప్పుకోవడం, లేనిదాన్ని ఉన్నట్లు చెప్పుకోవడం) సర్వసాధారణం అంటారు. సరైనోడు ఆడియో ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాన్ని ప్రూవ్ చేశాడంటున్నారు. ఎందుకంటే సెంటిమెంట్ పరంగా వైజాగ్ లో ఆడియో ఫంక్షన్ చేస్తే, చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరు తాను రిటైరైన తర్వాత వైజాగ్ లోనే ఉండిపోతానని అనౌన్స్ చేశాడు.

మెగాస్టార్ గా చిరంజీవి రిటైరై ఎనిమిదేళ్లు దాటింది. పాలిటిక్స్ లో అడ్రస్ లేకుండా పోయి రెండేళ్లుకు పైనే దాటింది. ఇప్పుడాయన యాక్టివ్ గా సినిమాల్లో లేరు, పాలిటిక్స్ లో ఎంత యాక్టివ్ గా ఉన్నా పట్టించుకునేవాళ్లు లేరు. పైగా వయస్సు చూస్తే 60 ఏళ్లు దాటాయి. ఇక ఏ అర్ధంలో రిటైర్మెంట్ పదం వాడాడో తెలియాలి మరి. ఇక రిటైర్మెంట్ అంటే ఏ యావగేషన్ లేకుండా ఎవరికంటా పడకుండా తన శేషజీవితం గడపడమనేది 70 వ ఏట అని చెప్తాడేమో. ఐనా 70 ఏళ్లు వచ్చినతర్వాత వైజాగ్ లో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా ఆయన వ్యక్తిగతమే కానీ ఇంకోటి కాదు.

ఏ సందర్భానికి తగ్గట్లు అక్కడ మాట్లాడటం ప్రశంసనీయమే అయినా, బెంగళూరుకి వెళ్తే అక్కడి వాతావరణం, హైదరాబాద్ లో ఉంటే సిటీ కేక అని, వైజాగ్ వెళ్తే ఇక్కడే  రిటైరవుతా అనడం ఆ క్షణంలో అక్కడున్నవాళ్లని ఆకట్టుకోవచ్చు కానీ, సందర్భోచితంగా అర్ధాలు తీసినప్పుడు అంత అతికినట్లు ఉండదు. పైగా చిరంజీవి నెలకి కనీసం పదిరోజులైనా అటు సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ యాక్టివ్ గా ఉంటే ఆ సంగతి వేరు. బైటికి కన్పించని బిజీ ఉంటే, అదీ వేరు మరిప్పుడు చిరంజీవి బిజీగా ఉన్నట్లేనా ఇంకా రిటైర్ అవ్వలేదా ఆయన..! ఎప్పుడొస్తుందో తెలీని 150 వ సినిమా ఎప్పుడు పూర్తవ్వాలి, ఎప్పుడు విడుదలవ్వాలి, అప్పటిదాకా రిటైర్మెంట్ లేదనే అనుకోవాలా..!
Chinranjeevi attended to Sarainodu function in Vizag. In this audio function his comments about Vizag city creating funny. He told after my retirement i will stay in Vizag.