కత్తిలాంటోడట

4 Apr 2016


మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా అంటూ దాదాపు రెండేళ్ల నుంచి తెగ హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపు కూడా మొదలైంది, ఈ లోపునే డెక్కన్ క్రానికల్ చిరంజీవి 151 వ సినిమా ఎప్పుడంటూ సెటైరికల్ గా కూడా రాసుకుంటోంది. దాని దృష్టిలో బ్రూస్ లీ నే 150వ సినిమా, అందుకే ఇప్పుడు వచ్చేది 151వ సినిమా అట. ఐతే ఇప్పుడు కొత్తగా చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ విశాఖపట్నంలో చిరంజీవి 150వ సినిమా టైటిల్ కత్తిలాంటోడంటూ ఎనౌన్స్ చేశాడు.

రకరకాల ముహూర్తాలు పెట్టుకుంటూ వస్తున్న ఈ సినిమా కథ కి మెరుగులు దిద్దుతున్నారట. మే నుంచి రెగ్యులర్ గాషూటింగ్ ఉంటుందని కూడా చెప్తుండటంతో, ఈసారి కన్ఫామ్ గా సినిమా ఓపెనింగ్ ఉంటుందని చెప్తున్నారు. సినిమాలో సామాజిక స్పృహ కూడా కలిగించేలా ఉంటుందంటూ బిల్డప్ ఇస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ కత్తి చూసినవాళ్లకి అందులో కథాంశం పెద్దగా కొత్తగా ఏం అన్పించదు. ఐతే చిరంజీవి ఆ పాత్రలో ఎలా ఇమిడిపోతాడు, ఎలా జనం ఆయన్ని రిసీవ్ చేసుకుంటారనేదే ఆసక్తి కలిగిస్తోంది.
All Tollywood fans are waiting for Chiranjeevi 150th movie. Recently Allu Aravind announced Chiranjeevi 150th movie title is Kathilantodu in Vizag.