బాబు డప్పు డ్యాన్స్

20 Apr 2016


గిరిజనుల అభివృద్దే నా ధ్యేయమంటూ ఏపి సిఎం  చంద్రబాబు డప్పేసి మరీ డ్యాన్సేశారు. విజయవాడలో మహిళా సర్పంచ్(గిరిజన) ల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు తమ సర్కారు వారికోసం ఎలా కృషి చేస్తుందో చెప్పుకొచ్చారు. దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 850 మంది గిరిజన మహిళా సర్పుంచులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి గిరిజన కుటుంబానికి  ఏడాదికి రూ. 30 వేల ప్రొత్సాహకం ఇస్తామన్న చంద్రబాబు ఆ మొత్తంతో ఎలా బతుకుతారో ఆయనే తెలియాలి, ఇస్తున్న ప్రోత్సాహకం వద్దనడం కాదు కానీ, కనీసం 60వేలు లేనిదే ఏ కుటుంబం పొట్టా గడవని స్థితి నేడు నెలకొంది.

ఇక  పంచాయితీ సేవలను ఆన్ లైన్ లో ఉంచి డిజిటల్ పంచాయితీలుగా తీర్చిదిద్దుతామనడం హైటెక్ హంగులద్దే ప్రయత్నమే తప్ప వారి బతుకులెలా బాగుపడాతాయో మరి. ఎందుకంటే చాలా చోట్ల చదువుకోని సర్పంచులు ఉన్న స్థితి ఉంది కదా, దీన్నెలా కాదనగలరు. ఐతే గిరిజన సదస్సులో డప్పు భుజానికి తగిలించుకుని దరువేసిన చంద్రబాబు, గిరిజన మహిళలతో కలిసి ఆదివాసీ తరహా నృత్యాలు చేశారు. ఆ తర్వాత గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో సదస్సుకు హాజరైన కళాకారులతో కలిసి చంద్రబాబు డ్యాన్సాడటం చూస్తే, ఏ డప్పుకు ఆ దరువు కొట్టడం సిద్దహస్తుడనిపించకమానదు.
Today in Vijayawad tribal meating was held by Chandrababu Naiud. For this more than 18 states tribal leaders were attended.