మహేష్ బాబు కోసం చంద్రబాబు మంత్రాంగం

15 Apr 2016


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చిన నేపథ్యంలో తమ పార్టీలోకి మరో అగ్ర హీరో మహేష్ బాబును తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సూచన మేరకు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీకి మహేష్ బాబు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల దర్వాత జనసేన పవన్ కల్యాణ్ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ ఉద్దేశాల గురించి చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన 2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ తమతో ఉంటాడని భావిస్తున్నామని, తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని అనుకున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటి వరకు అదే భావనతో ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఎంత కాదనుకున్నా పవన్ కల్యాణ్ హవా నడిచిందని, అందువల్లే టిడిపి ఆ రెండు జిల్లాల్లో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు. అయితే పవన్ 2019 ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన చేయడంతో టిడిపి మరో అగ్ర సినీ హీరో మహేష్ బాబు కోసం మంత్రాంగం నిర్వహిస్తోందని అంటున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించిందని సమాచారం. మహేష్ బాబును 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారానికి వచ్చేలా ఒప్పించాలని గల్లాకు సూచనలు అందాయని మీడియాలో వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్ దూరమైనా మహేష్ హవాతో ఆ లోటును భర్తీ చేయొచ్చని టిడిపి అధిష్టానం భావిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ కూడా తమతో ఉన్నట్టేనని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ విషయం ఇంకా తేలలేదు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ టిడిపి తరఫున తప్పకుండా ప్రచారం చేస్తారు.బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తమ పార్టీ కోసం ప్రచారం చేస్తే తాము తప్పకుండా నెగ్గుతామనే ధీమా తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది. మహేష్ బాబు రాజకీయాల పట్ల ఎప్పుడూ ఆసక్తి ప్రదర్శించలేదు. పైగా విముఖత కూడా వ్యక్తం చేశారు. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, పెద్ద నాన్న ఆదిశేషగిరి రావు గతంలో కాంగ్రెసు వైపు ఉన్నా మహేష్ బాబు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు.
After Sardaar Gabber Singh movie release Pavan Kalyan interview declared about his future plans in politics. He wont continue in TDP. So Chandrababu Naidu is trying to impress Mahesh Babu for his political future.