కట్టు 100కోట్లు

6 Apr 2016కొప్పు కొప్పు కొట్టుకుంటే ఇద్దరి రహస్యాలు బైటపడతాయంటారు. .అలానే బాలీవుడ్ సెక్సిణి సన్నీ లియోన్ పై తన పరువు తీసిందంటూ పూజామిశ్రా అనే యువతి వందకోట్లకి పరువు నష్టం దావా వేసింది. ఇది బాగా ఖరీదైనది గా కన్పిస్తున్న యవ్వారమే అయినా  పూజా మిశ్రా చెప్తున్న లెక్కలు చూస్తుంటే నిజమే అన్పించకమానదు. బిగ్ బాస్ -5 సీజన్ లో ఈ ఇద్దరూ పోటీపడ్డారట, ఐతే పూజామిశ్రాకే ఎక్కువ పాపులారిటి వచ్చిందని చెప్పుకుంటుందామె. ఐతే ఎప్పుడైతే సన్నీ లియోన్ ఎంట్రీ ఇచ్చిందో అప్పట్నుంచీ ఈమెగారి క్రేజ్ తగ్గిపోతూ వచ్చిందట, తనపై ఈర్ష్యతోనే సన్నీ లేనిపోనివన్నీ కల్పించి ఇంటర్వ్యూలు ఇస్తూ తనని బద్నామ్ చేసిందని పూజా మిశ్రా వాపోతోంది.

అప్పటిదాకా తనకి బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, సన్నీ కొట్టిన దెబ్బతో తన ఆస్తులు కరిగిపోయాయని పూజా మిశ్రా వాదన. అవన్నీ డబ్బుగా మార్చుకుని జీవనం సాగిస్తున్నానని, ఇలా తన పరువుకి నష్టం కలిగించినందున సన్నీ 100 కోట్లు కట్టాలని డిఫమేషన్ సూట్ దాఖలు చేసింది పూజామిశ్రా. బాంబే హైకోర్టు దీన్ని విచారణకు తీసుకుని సమ్మర్ హాలిడేస్ తర్వాత విచారిస్తుందట. ఐతే పూజామిశ్రా ఇంతవరకూ ఊరుకుని ఇప్పుడెందుకు ఇలా పరువు పోరాటం మొదలెట్టిందన్నదే ప్రశ్న, దీనివెనుక సన్నీని బ్లాక్ మెయిల్ చేసి కాస్త డబ్బులు గుంజుదామనే ఆలోచనే కన్పిస్తుందని సన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.
A case was filed on Sunny Leone in Mumbai High Court. Bollyood h0t beauty Puja Mishra filed case against Sunny. After Sunny entered into industry  my image was damaged.