పండుగ నాడూ ఫిరాయింపులేనా?

11 Apr 2016


  పండుగనాడైనా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే పాడు పనులను సిఎం చంద్రబాబు మానుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హితవు పలికారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీతులు చెప్పే సిఎం, ఆచరణలో తనకో రీతి, ఇతరులకో రీతి అన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయింపులను దుమ్మెత్తి పోశారని, తెలంగాణాలో టిడిపి ఎమ్మెల్యే టిఆర్‌ఎస్‌లో చేరితో తీవ్ర నేరంగా పరిగణించిన ఆయన, రాష్ట్రంలో వైసిపి ఎమ్మెల్యేలను ఎందుకు తన పార్టీలోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా ప్రజలకు మేలు కలిగే పనులపై దృష్టి పెట్టాల్సిన సిఎం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పచ్చ కండువాలను కప్పటమే పనే ముఖ్యంగా భావించటం శోచనీయమన్నారు. దుర్ముఖి నామ సంవత్సరాన్ని చంద్రబాబు దుష్ట నీతితో ఆరంభించారన్నారు. పార్టీ ఫిరాయింపుదార్లకు తాయిలాలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో, యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో బహిర్గతపరచాలని డిమాండు చేశారు.
CPI state secretary Rama Krishna was fired on AP CM Chandrababu Naidu. He is talking about TDP MLAs jumping into TRS, but why he did not talk about YSRCP attracting.