నాలా ఎవరూ కావద్దు

4 Apr 2016


అడుసుతొక్కనేల కాలు కడగనేల అంటారు. ఐతే కావాలని ఎవరూ బురదలో కాలేయరంటోంది బ్రీ ఓల్సన్. ఐతే తమ జీవితాలను చూసైనా ఇంకోకళ్లు ఇంకొకళ్లు మాలా మారకుండా ఉండటానికే తమ కథలను చెప్తున్నామంటోందామె. ఇంతకీ బ్రీ ఓల్సన్ ఎవరంటే అమెరికాలోని ఓ పోర్న్ స్టార్. ముందు డబ్బు మజా కోసం బూతు సినిమాల్లో నటించానని, తర్వాత అందులోంచి బైటపడిన తర్వాతే అసలు చిక్కులు మొదలు అయ్యాయని చెప్తోందీమె. పోర్న్ స్టార్ గా రకరకాల వ్యక్తులతో పక్క పంచుకుంటారు వీళ్లు తర్వాత దాన్ని వదిలించుకుందామన్నా బ్రీ ఓల్సన్ కి కుదరలేదట. ఎక్కడకు వెళ్లినా గుర్తు పట్టి రాత్రికి రమ్మనే మగాళ్లు, చీదరించుకుంటూ కామెంట్లు చేసే అమ్మాయిలు, ఇలా పిచ్చెత్తిపోతుందని  నాలా ఇంకెవరూ కావద్దంటూ విలపిస్తోంది.

ఎక్కడకు వెళ్లినా చీప్ గా వల్గర్ గా బిహేవ్ చేస్తున్నవారికి కూడా తనని వదిలేయాలని చెప్తోంది. పాడు పడుపు వృత్తిలాంటి కెరీర్ కి గుడ్ బై చెప్పేసి, బిజినెస్సులు చేసుకున్నా అవి దెబ్బతిన్నాయని ఓల్సన్ బాధపడింది.  సొసైటీ  ఇలా వేధిస్తే తానెలా బతకాలంటూ వాపోతోంది. ఈమెలాంటి కథే సన్నీ లియోన్ కి ఎదురయ్యేది కానీ, ఆమె లక్ బాగుండబట్టి హిందీ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. సన్నీకి కూడా ఇప్పటికీ అలాంటి రెచ్చగొట్టే ప్రశ్నలు  ఎదురవుతున్నా, వేధించే పరిస్థితి మాత్రం లేదు. మరోవైపు ఈమె ఉదంతం బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కి కూడా ఓ కనువిప్పు కావాలి. ఎందుకంటే సన్నీ క్రేజ్ ఆమెకి వస్తున్న ఆఫర్లు చూసి ఈ సెక్సిణి కూడా పోర్న్ స్టార్ని అవుతానంటూ  బెదిరించింది. అసలు వళ్లు తమది కాదన్నట్లు బట్టల్లోంచి బైటపడేసి తిరిగే సదరు సెక్సిణికి ఆ అనుభవం లేదని ఎవరూ అనరు. కాకపోతే బరి తెగించినట్లు బూతుసినిమాలు చేస్తాననేవారికి బ్రీ ఓల్సన్ ఉదంతం చెప్పుతో కొట్టినట్లే అవుతుంది.
Hollywood p0rn star Bree Olson telling about problems facing by her. Once upon a time she is p0rn star, now she is doing business, but still she is facing problems about her past life.