నిజంగా వీళ్లంతా బ్లాక్ షీప్సేనా?

6 Apr 2016


నల్లధనం పేరు ఎప్పుడు తెరపైకి వచ్చినా, మనదేశంలో అదో సంచలనమే అవుతుంది. ముందు భారీగా హడావుడి చేయడం ఆ తర్వాత చడీ చప్పుడు లేకుండా అవడం మామూలైపోయింది. ప్రభుత్వాలు మారినా పెద్ద తేడా ఏం రావడం లేదు. ఇప్పుడు పనామాదేశంలో బైటపడ్డ డాక్యుమెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లాక్ షీప్స్ గురించి వెలుగులోకి తెస్తే అందులోనూ 500 మంది ఇండియన్ల అక్కౌంట్లు బయటపడ్డాయ్. వారిలో బిగ్ బి అమితాబ్, ప్రాపర్టీ డెవలపర్స్ కేపీ సింగ్, వంటి వారుండటం మరోసారి సెన్సేషన్ కలిగిస్తోంది. గత ఏడాది హెచ్ఎస్ బీసీ అక్కౌంట్లు లీకవడం, అందులో 1100 మంది ఇండియన్ల ఖాతాలు బైటికి రావడం ఓ  సంచలనం ఇప్పుడు ప్లేస్ మారింది. బ్లాక్ మనీకి స్వర్గంగా చెప్పే పనామా దేశంలో కోటి పది లక్షల డాక్యుమెంట్లు బైటికి వచ్చాయ్. ఇందులో రష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్, మాజీ నియంతలు గఢాపీ, నుంచి బిగ్ బి అమితాబ్, ఐశ్వర్యారాయ్, డీఎల్‌ఎఫ్ ప్రమోటర్‌ వెస్ట్ బెంగాల్ లీడర్  శిశిర్ బజోరా, ఢిల్లీ లోక్‌సత్తా చీఫ్‌ అనురాగ్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది.

వీరంతా పన్ను ఎగ్గొట్టి ఓవర్సీస్ అక్కౌంట్లలో డబ్బు దాచుకోవడమే కాకుండా, రకరకాల పేర్లతో కంపెనీలు స్థాపించారని పనామా డాక్యుమెంట్లలో ఉంది. ఫారిన్ కంట్రీల్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుు మోనాకో ఫోనెక్సా లా ఫర్మ్ ప్రసిధ్ది. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా క్లయింట్లు ఉన్నారు. సంపాదించిన సొమ్ముకు దొంగలెక్కలు చెప్పడంలో ఈ ఆడిటింగ్ కంపెనీకి మంచి ప్రావీణ్యముందంటారు. నటి బిగ్ బి కోడలు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్ కి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని కంపెనీ ఉందట. ఐశ్యర్య రాయ్‌, ఆమె తండ్రి రమణరాజ్‌ కృష్ణరాయ్‌, తల్లి విందాకృష్ణ రాజ్‌ రాయ్‌, సోదరుడు ఆదిత్య రాయ్‌ డైరెక్టర్లుగా 2005 లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. మొదట ఈ కంపెనీకి ఐశ్యర్య డైరెక్టర్‌గా ఉండగా, తర్వాత షేర్‌ హోల్డర్‌గా మారిపోయారు. 2008 లో ఈ కంపెనీ రద్దయింది. ఐతే డబ్బు సంగతి మాత్రం తెలీదు. అలానే బిగ్ బి అమితాబ్‌ కి బహమస్‌ లో కంపెనీలు ఉన్నాయట. నాలుగు ఆఫ్ షోర్ కంపెనీల్లో  అమితాబ్ బచ్చన్ డైరెక్టర్‌గా ఉన్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. ఇందులో ఒకటి బీవీఐలో ఉండగా, మరో మూడు బహమస్‌లో ఉన్నట్టు తేలింది. 1993లో స్థాపించిన ఈ కంపెనీల మూలధనం కేవలం 5వేల నుంచి 50వేల డాలర్లు కాగా, ఇవి చేసే ఓడల వ్యాపారం కోట్ల డాలర్లలో ఉంటూ వస్తుంది. బ్లాక్ మనీకి సంబంధించి ఇప్పుడిలా వీరిద్దరి పేర్లు బైటపడటం సంచలనమే మరి ఇప్పటిదాకా బిగ్ బి ఈ న్యూస్ పై స్పందించలేదు.
Black money is topic in India. NDA government is always saying we will get back black money from Foreign countries.