ఆకట్టుకున్న మహేష్ బ్రహ్మోత్సవం

13 Apr 2016


సినిమా రిలీజ్ కి ముందే మంచి టాక్ ఉన్న బ్రహ్మోత్సవం ఇప్పుడు ఓ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ డ్యూ ఉంది. రెండు మూడ్రోజుల్లో హైదారాబాద్ లో సీన్స్ షూటింగ్ పూర్తి చేసుకుని, డబ్బింగ్ కి వెళ్తున్నట్లు సినిమా యూనిట్ చెప్తోంది. ఉగాదికి విడుదలైన లుక్ లో మహేష్ బాబు ఓ పెద్దాయనకు చెప్పులు తొడుగుతున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. బహుశా ఇది తండ్రి క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ అయి ఉండొచ్చని ఊహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఓ పాట టీజర్ ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా చెప్పేస్తుంది. 

స్క్రీన్ నిండుగా కన్పించడానికి ముగ్గురు అందాల ముద్దుగుమ్ముల సమంతా, కాజల్, ప్రణీత ఉండగా మరో పాత్రలో రష్మి కన్పిస్తుందంటున్నారు. ఇక ప్రిన్స్ గారాలపట్టి సితార కూడా ఇందులో మెరుస్తుందని లీక్ అయింది. మిక్కీ జే మేయర్ సిజ్లింగ్ సూతింగ్ సాంగ్స్ ఖచ్చితంగా మళ్లీ మళ్లీ వినాలనిపించే రేంజ్ ఉంటాయని టాక్, సినిమా మొత్తం పనులు పూర్తి చేసుకుని కృష్ణ బర్త్ డేకి రిలీజ్ ప్లాన్ చేస్తారని టాక్. ముందు సమ్మర్ అనుకున్నా, టైమింగ్ రైమింగ్ అన్నీ కుదరాలనుకునే ఆడియో కూడా వాయిదా వేస్కున్నట్లు సమాచారం.
All Tollywood fans and Mahesh Babu fans are waiting for Bhramostavam Movie. For this Ugadi it first look was released and got good response. It is going for dubbing.