శాతకర్ణి ఓపెనింగ్ డేట్ ఫిక్స్

20 Apr 2016


భారతదేశాన్ని పాలించిన తొలి రాజంటూ ఈ మధ్య హడావుడి చేస్తున్న బాలకృష్ణ ఆ క్యారెక్టర్లో నటించడానికి ఓపెనింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ నెల 22 అంటే  శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దానికోసం చెవులదాకా మీసం పెంచేసి హంగామా చేస్తున్న బాలయ్య ఇక ఆ రోజు ఫుల్ గెటప్ తో జనం ముందుకు రాబోతున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ లో సంబరాలు మొదలయ్యాయ్.

బాలయ్య గౌతమీపుత్రశాతకర్ణి క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పినప్పట్నుంచీ దీనిపై అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దీన్ని తన తండ్రి ఎన్టీఆరే చేయాలనుకున్నారని, కుదరలేదని కూడా చెప్పాడాయన. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, శాలివాహనశకం ప్రారంభించిన రాజుగా ఓ ముఫ్పై ఏళ్లక్రితం ఈనాడు పేపర్లో ఓ బొమ్మల కథ కూడా వచ్చింది. కుమ్మరి కుండలను చేస్తూ మట్టి సైనికులును చేస్తే వారికి ప్రాణం పోసి యుధ్దం చేసిన సన్నివేశం కూడా అందులో ఉంటుంది. ఫాంటసీగా చెప్పుకోవడానికి, తెరకెక్కించడానికి ఇందులో బోలెడంత డ్రామా ఉంది కూడా.

బాలయ్య తన తండ్రి వరకూ ఎందుకు, ఆయనే ఓ పదేళ్ల క్రితం వరకూ తనకి చెంఘిజ్ ఖాన్ కథ తెరకెక్కించాలనే కోరిక అనేక సందర్భాల్లో వ్యక్తపరిచేవాడు. మరి అలాంటి కథను కూడా ఇదైపోగానే చేస్తాడేమో చూడాలి, ప్రస్తుతానికి గౌతమీపుత్ర శాతకర్ణిలో హీరోయిన్లు, మిగిలిన నటుల గురించి తెలీదు. బహశా కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, సుమన్ లాంటి వారందరికీ అవకాశం ఉండే ఉంటుంది.
Balakrisha is busy with his hundred movie post production work. For this movie he changed his style. This movie shooting is starting on this Friday.